Site icon HashtagU Telugu

Deepak Chahar:ఒక్క మ్యాచ్ ఆడకున్నా రూ.14 కోట్లు

Deepak Chahar

Deepak Chahar

ఐపీఎల్ 15వ సీజన్ లో వరుస వైఫల్యాల మధ్య కొట్టుమిట్టాడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ దూరమవడం పెద్ద దెబ్బ గానే చెప్పాలి వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి పూర్తిగా దూరమైనట్లు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఇటీవలే అధికారిక ప్రకటించింది. గతేడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున 15 మ్యాచ్‌లాడిన దీపక్ చాహర్.. 14 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే అతన్ని రూ.14 కోట్లకు మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. అయితే గాయం కారణంగా కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగకుండానే ఈ సీజన్ నుంచి అతను వైదొలిగాడు.

ఇదిలాఉంటే.. దీపక్‌ చహర్‌కు ఈ ఏడాది మెగావేలంలో దక్కించుకున్న రూ.14 కోట్లలో చెన్నై సూపర్ కింగ్స్ఒ ఫ్రాంచైజీ ఒక్క రూపాయి కూడా చెల్లించే అవకాశం లేదని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ కొత్త రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్ సీజన్‌ ఆరంభానికి ముందు జట్టుకు దూరమై.. ఆ తర్వాత సీజన్‌ మొత్తం నుంచి తప్పుకుంటే ఆ ఆటగాడికి ఒక్క రూపాయి చెల్లించే ఛాన్స్ ఉండదు. దింతో దీపక్ చహర్‌ మెగావేలంలో దక్కించుకున్న రూ.14 కోట్లు కోల్పోయినట్లే అని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్‌లో దీపక్ చాహర్ ఒక్క మ్యాచ్‌ ఆడకపోయినా మెగా వేలంలో దక్కించుకున్న 14 కోట్లు అతని అకౌంట్ లో చేరనున్నాయి. ఎందుకంటే.. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ గ్రేడ్ సీ ఆటగాళ్ల జాబితాలో ఉన్న దీపక్ చాహార్‌కు ఇన్సురెన్స్ పాలసీ కారణంగా వేలంలో సొంతం చేసుకున్న రూ.14 కోట్లు దక్కనుంది. బీసీసీఐ సొంతంగా తమ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు ఇన్సురెన్స్ పాలసీ డబ్బులు చెల్లించనుంది.

Exit mobile version