Site icon HashtagU Telugu

Deepak Chahar: ధోనీ రిటైర్మెంట్ పై తేల్చేసిన చాహర్

Deepak Chahar Issues Massive Statement Ondhoni Ipl retirement

Deepak Chahar Issues Massive Statement Ondhoni Ipl retirement

ఐపీఎల్ 16వ సీజన్ కు సమయం దగ్గర పడుతోంది. అన్ని ఫ్రాంచైజీలు తన సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్ళతో ఇప్పటికే శిక్షణా శిబిరాలు కూడా మొదలుపెట్టాయి. అటు ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రాక్టీస్ షురూ చేసింది. గత సీజన్ పేలవ ప్రదర్శనను పక్కనపెట్టి కెప్టెన్ ధోనీ సైతం ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. భారీ షాట్లతో మహి దుమ్ము రేపుతున్నాడు. అయితే ఈ సీజన్ తో ధోనీ ఐపీఎల్ కెరీర్ కు గుడ్ బై చెబుతాడన్న వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినా ధోనీ మాత్రం చెన్నైలోనే తన వీడ్కోలు మ్యాచ్ ఉంటుందని అప్పుడు స్పష్టం చేశాడు. కోవిడ్ కారణంగా మధ్యలో విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించడంతో ధోనీ రిటైర్మెంట్ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఈ సారి హౌంగ్రౌండ్ చెపాక్ స్టేడియంలో చెన్నై మ్యాచ్ లు ఆడనున్న నేపథ్యంలో తాలా రిటైర్మెంట్ పై మళ్ళీ చర్చ మొదలైంది.

అయితే ధోనీ రిటైర్మెంట్ వార్తలపై చెన్నై బౌలర్ దీపక్ చహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా తప్పుడు ప్రచారమేనని, అసలు రిటైర్మెంట్ గురించి ధోని గానీ టీమ్ మేనేజ్మెంట్ గానీ ఏమైనా చెప్పిందా అని ప్రశ్నించాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన చాహర్ (Deepak Chahar) తాను ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ధోనీ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదన్నాడు. తనకు తెలిసి మహీ భాయ్ మరికొన్నాళ్లు ఐపీఎల్ ఆడతాడనీ, . అతడు ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉన్నాడని గుర్తు చేశాడు. ధోనీ మరికొన్నేళ్లు ఆడాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు. ఇక రిటైర్మెంట్ గురించి ధోనికే తెలుసన్నాడు. టెస్టు క్రికెట్ లో ఎవరూ ఊహించని టైమ్ లో రిటైర్మెంట్ ఇచ్చాడనీ, అలాగే అంతర్జాతీయ క్రికెట్ నుంచి అదే తరహాలో తప్పుకున్న విషయాన్ని చాహర్ (Deepak Chahar) గుర్తు చేసాడు.

నిజానికి గత సీజన్ ముందు జడేజాకు ధోనీ పగ్గాలు అప్పగించడంతో ఆటగాడిగా అతని కెరీర్ ముగిసిందని భావించారు. అయితే జడేజా అనుకున్న స్థాయిలో జట్టును నడిపించలేకపోవడంతో ఫ్రాంచైజీ సూచనతో సీజన్ మధ్యలో ధోనీ మళ్ళీ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ధోనీ మళ్లీ కెప్టెన్ గా అందుకున్నప్పటకీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పేలవ ప్రదర్శన కనబరిచిన చెన్నై 14 మ్యాచ్ లలో కేవలం 4 విజయాలే సాధించి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఈ సారి హోంగ్రౌండ్ లో ఆడనున్న చెన్నైని ధోనీనే లీడ్ చేయబోతున్నాడు. ఎలాగైనా కప్ కొట్టి గత సీజన్ ప్రదర్శనను మరిచిపోవాలని ధోనీ భావిస్తున్నాడు. ఈ సీజన్ ముగిసేసరికి ధోనీ రిటైర్మెంట్ పై స్పష్టత వచ్చే అవకాశముంది.

Also Read:  Fire Boltt Terminator: రూ. 2 వేల కంటే తక్కువ ధరలో స్మార్ట్ వాచ్ కొనాలని ఉందా.. ఫైర్-బోల్ట్ టెర్మినేటర్ పై ఓ లుక్కేయండి..