RCB Hall Of Fame: RCB హాల్ ఆఫ్ ఫేమ్ లో గేల్, ఏబీడీ

గుజరాత్ టైటాన్స్‌తో తమ ఆఖరి మ్యాచ్‌కు ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డుల కార్యక్రమం నిర్వహించింది.

  • Written By:
  • Updated On - May 17, 2022 / 03:37 PM IST

గుజరాత్ టైటాన్స్‌తో తమ ఆఖరి మ్యాచ్‌కు ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డుల కార్యక్రమం నిర్వహించింది. ఇందులో బెంగుళూరు ఆటగాళ్లు పాల్గొని సందడి చేశారు. దీనికి సంబందించిన వీడియోను తాజాగా ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఆర్సీబీ మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్, వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ కు చోటు కల్పించింది.

ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎబి డివిలియర్స్, క్రిస్ గేల్ లను అభినందించాడు. ఎబి డివిలియర్స్‌తో క‌లిసి 11 ఏళ్ళు, క్రిస్‌ గేల్ కలిసి 7 ఏళ్ళు ఆడానని పేర్కొన్న కోహ్లీ.. ఇలాంటి గొప్ప ఆటగాళ్లను కలుసుకోవడం తన జీవితంలో మర్చిపోలేనని చెప్పాడు. ఇక ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటుదక్కడంపై ఎబి డివిలియ‌ర్స్, క్రిస్ గేల్ స్పందించారు. ఇలాంటి అరుదైన గౌరవం కల్పించిన ఆర్సీబీ ఫ్రాంచైజీకి ప్ర‌త్యేక ధ‌న్యావాదాలు తెలిపారు. ఇక ఇప్పటివరకు ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లు ఆడిన గేల్‌ 149 స్ట్రైక్‌రేట్‌తో 4965 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉండడం విశేషం. అలాగే . చివరగా ఐపీఎల్‌-2021లో ఆడిన ఏబి డివిలియర్స్‌.. 2 అర్ధ సెంచరీలతో 313 పరుగులు సాధించాడు. .ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 184 మ్యాచ్‌లాడిన ఏబీ 5162 పరుగులు చేశాడు. అలాగే దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు డివిలియర్స్‌ ఆడాడు.

ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌ల్లో పది విజయాలతో 20 పాయింట్లు సాధించి ప్లేఆఫ్ చేరగా.. బెంగళూరు జట్టు 14 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే .. నెట్ రన్ రేటు తక్కువగా ఉన్న కారణంగా గుజరాత్‌ టైటాన్స్ పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించాలి. అలాగే రాజస్థాన్ రాయల్స్ తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలవ్వాలి.