DC vs RR Result: బట్లర్ శతక మోత… రాయల్స్ దే గెలుపు

ఐపీఎల్ 15 వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్ టీమ్ మళ్ళీ టాప్ లేపింది.అఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 15 ప‌రుగుల తేడాతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది.

  • Written By:
  • Publish Date - April 23, 2022 / 12:25 AM IST

ఐపీఎల్ 15 వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్ టీమ్ మళ్ళీ టాప్ లేపింది.అఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 15 ప‌రుగుల తేడాతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు ఓపెనర్లు తిరుగులేని ఆరంభాన్ని ఇచ్చారు. బట్లర్ , పడిక్కెల్ తొలి వికెట్ కు 155 రన్స్ జోడించారు. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో జోస్ బ‌ట్ల‌ర్ సెంచ‌రీతో చెల‌రేగాడు. బ‌ట్ల‌ర్ కేవలం 65 బంతుల్లో 116 ప‌రుగులు సాధించాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. కాగా ఈ సీజ‌న్‌లో అత‌డికి ఇది మూడో సెంచ‌రీ.
బట్లర్ తో పాటు ప‌డిక్కల్‌ 54 , శాంస‌న్‌ 46 పరుగులతో బ్యాట్ ఝుళిపించారు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగుల‌ భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఖాలీల్ ఆహ్మ‌ద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ సాధించారు.

223 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. వార్నర్ , షా తొలి వికెట్ కు భారీ ఆరంభం ఇవ్వలేక పోయారు. మిగిలిన వారిలో పంత్ , లలిత్ యాదవ్ మాత్రమే రాణించారు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 207 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్‌ 44, ల‌లిత్ యాద‌వ్‌ 37, పృథ్వీ షా 37 ప‌రుగుల‌తో రాణించారు.
ఒబెడ్ మెక్‌కాయ్ వేసిన‌ చివరి ఓవ‌ర్‌లో 36 ప‌రుగులు అవ‌స‌ర‌మవ్వ‌గా.. పావెల్‌ తొలి మూడు బంతుల‌కు మూడు సిక్స‌ర్‌లు బాది ఢిల్లీ విజ‌యంపై ఆశ‌లు రేపాడు.అయితే చివ‌రి మూడు బంతుల్లో కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. పావెల్ మూమెంట్ చూస్తే ఢిల్లీని గెలిపించేలా కన్పించాడు. అయితే మూడో బంతికి రాజస్థాన్ ప్లేయర్ ఒబెడ్ మెక్‌కాయ్ వేసిన ఫుల్ టాస్‌ను అంపైర్ సరైన బాల్‌గానే ప్రకటించడంతో ఢిల్లీ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ నోబాల్ వివాదం వల్ల అతని ఏకాగ్రత దెబ్బతిన్నట్లు కన్పించింది. దీంతో తన మూమెంట్ కోల్పోవడం, చివరి బంతికి ఔటవ్వడంతో 15పరుగుల తేడాతో ఢిల్లీ ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.