DC vs PBKS: 31 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించిన పంజాబ్.. టోర్నీ నుంచి వార్నర్ సేన ఔట్..!

  • Written By:
  • Publish Date - May 13, 2023 / 11:24 PM IST

DC vs PBKS: ఐపీఎల్ 59వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) 31 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC)ను ఓడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి. క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. దింతో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

పంజాబ్‌ 31 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిలిచింది. ఢిల్లీ జట్టు 12 గేమ్‌ల్లో ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా 12 పాయింట్లు మాత్రమే. ఇ వంటి పరిస్థితిలో ఢిల్లీ ఢిల్లీ జట్టు తదుపరి రౌండ్ కు చేరుకోలేదు. మరోవైపు ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. 12 పాయింట్లు సాధించి ఆరో స్థానానికి చేరుకుంది.

Also Read: LSG vs SRH: సన్‌రైజర్స్ ను ఓడించిన లక్నో.. బ్యాట్ తో అదరగొట్టిన ప్రేరక్ మన్కడ్.. ఎవరీ ప్రేరక్..?

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్దేశించిన 168 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఢిల్లీ.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా పంజాబ్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్ బౌలర్లలో స్పిన్నర్ హర్‌ప్రీత్ నాలుగు వికెట్లు, రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ సీజన్ లో పంజాబ్ జట్టు మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.