Site icon HashtagU Telugu

BCCI: ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ వేదిక మారింది

Ipl

Ipl

ఐపీఎల్‌ 2022 సీజన్‌ సజావుగా సాగుతున్న సమయంలో తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆర్సీబీతో మ్యాచ్‌ తర్వాత జట్టులోని కీలక ఆటగాళ్లు కరోనా మహమ్మారి బారిన పడ్డాడని సమాచారం. ఈ వార్త తెలిసి డీసీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్‌ 20పంజాబ్‌ కింగ్స్‌తో తలపడబోయే మ్యాచ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ బయటికి వచ్చింది. ఈఅంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ స్పందిస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్‌ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుందని, అయితే మ్యాచ్‌ వేదిక పూణే నుంచి ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియంకి మార్చినట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ బృంద సభ్యులు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండగా వారికీ బుధవారంఉదయం మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తామని, ఒకవేళ ఇందులో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ గా తేలితే ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేస్తామని వెల్లడించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మిచెల్ మార్ష్‌తో పాటు మ‌రో అయిదుగురికి క‌రోనా పాజిటివ్ వచ్చింది. ఫిజియో ప్యాట్రిక్ ఫ‌ర్హ‌త్‌, మ‌సాజ్ థెర‌పిస్ట్ చేత‌న్ కుమార్‌, టీమ్ డాక్ట‌ర్ అభిజిత్ సాల్వి, సోష‌ల్ మీడియా కాంటెంట్ మెంబ‌ర్ ఆకాశ్ మానేల‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో మిచెల్‌ మార్ష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా, మిగతా వారు ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.