DC vs MI: ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలు : హార్దిక్

గతంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఓటమికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో ఢిల్లీని ఓడించింది. అయితే ఈ రోజు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైని ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లను మెరుపరుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై స్థానాన్ని అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది.

DC vs MI: గతంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఓటమికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో ఢిల్లీని ఓడించింది. అయితే ఈ రోజు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైని ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లను మెరుపరుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై స్థానాన్ని అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది. ఢిల్లీతో ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో ముంబై 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 257 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ముంబై తరుపున తిలక్ వర్మ 32 బంతుల్లో,4×4, 4x,6 63 పరుగులతో చెలరేగాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య 24 బంతుల్లో, 4×4, 3×6 46 పరుగులతో రాణించాడు, టిమ్ డేవిడ్ 17 బంతుల్లో, 2×4, 3×6 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ తరుపున ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 27 బంతుల్లో, 11×4, 6×6 84 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (48; 25 బంతుల్లో, 6×4, 2×6), షై హోప్ (41; 17 బంతుల్లో, 5×6) సత్తాచాటారు.

ముంబై ఇండియన్స్ ఓటమి తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో మాట్లాడుతూ ఓటమికి కారణాలను వెతికారు. ఒకప్పుడు ఓవర్ల తేడాతో మ్యాచ్ ఫలితం మారేది. కానీ ఇప్పుడు కొన్ని బంతుల తేడాతో మ్యాచ్ ఫలితం కనిపిస్తుందన్నారు హార్దిక్. బౌలర్లు ఒత్తిడికి లోనవుతున్నందున మ్యాచ్ ఫలితం అనుకూలంగా రాలేదని చెప్పాడు హార్దిక్. నేను ఏదైనా ఎంచుకోవలసి వస్తే మిడిల్ ఓవర్లలో మరికొన్ని అవకాశాలను సృష్టించకోవాలన్నారు. జాక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ బ్యాటింగ్ చేసిన విధానంపై హార్దిక్ ప్రశంసించారు. అతను తెలివైనవాడని, అతను మైదానంలో నిజంగా బాగా రాణించాడని హార్దిక్ చెప్పాడు. అలాగే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం ఓటమికి కారణం కాదని అభిప్రాయపడుతున్నాను అని చెప్పాడు ముంబై కెప్టెన్ హార్దిక్.

ఈ సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన బాగా లేదు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు తొలి మ్యాచ్ లో ఓడినప్పటికే ఆ తర్వాత అద్భుతంగా పునరాగమనం చేసింది. అయితే మళ్ళీ ముంబైకి పరాజయాల పరంపర కొనసాగింది. ముంబై జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా, కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.

Also Read: Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్