DC vs KKR: ఐపీఎల్ 2025 48వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ను ఓడించింది. ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌లో KKR 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. దీనికి జవాబుగా ఢిల్లీ జట్టు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఒక దశలో ఢిల్లీ 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ (62 పరుగులు), అక్షర్ పటేల్ (43 పరుగులు) సునాయాసంగా మ్యాచ్ గెలిపిస్తారని అనిపించింది. కానీ సునీల్ నరైన్ ఒక ఓవర్‌లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను తిప్పికొట్టాడు. నరైన్ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హోం గ్రౌండ్‌లో 4 మ్యాచ్‌ల్లో 3 ఓటములను చవిచూసింది.
Also Read: Traffic Diversions: ప్రధాని మోదీ పర్యటన.. ఏపీలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కేకేఆర్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ ఉత్తేజకర విజయానికి హీరోగా నిలిచిన సునీల్ నరైన్ తన మాయాజాల స్పిన్‌తో మ్యాచ్‌ను తిప్పికొట్టాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి 204 పరుగులు చేసింది. దీనికి జవాబుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 130 పరుగులు సాధించింది. ఫాఫ్ డు ప్లెసిస్ (45 బంతుల్లో 62 పరుగులు), అక్షర్ పటేల్ (23 బంతుల్లో 43 పరుగులు) సునాయాసంగా ఢిల్లీని విజయతీరాలకు చేరుస్తారని అనిపించింది. కానీ సునీల్ నరైన్ ఆటను తిరగరాశాడు. ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ 14 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
60 పరుగుల వద్ద 3 వికెట్లు పడినప్పుడు కేకేఆర్ సులభంగా మ్యాచ్ గెలుస్తుందని అనిపించింది. కానీ ఫాఫ్, అక్షర్ కౌంటర్ అటాక్ చేశారు. వీరిద్దరూ వేగంగా పరుగులు చేయడం ప్రారంభించారు. వీరి మధ్య 76 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. 13.1 ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అప్పుడు సునీల్ నరైన్ అక్షర్ పటేల్‌ను ఔట్ చేశాడు. అక్షర్ 23 బంతుల్లో 43 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అతని బ్యాట్ నుండి 4 ఫోర్లు, 3 సిక్సర్లు వచ్చాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున సునీల్ నరైన్ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు. వీరితో పాటు అంకుల్ రాయ్, వైభవ్ అరోరా, ఆండ్రే రస్సెల్ ఒక్కొక్క వికెట్ సాధించారు.