DC vs KKR: కేకేఆర్ vs ఢిల్లీ… గెలుపెవరిది?

ఐపీఎల్ 16వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విశాఖ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ వేదికపైనే చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ తొలి విజయాన్ని అందుకుంది.

DC vs KKR: ఐపీఎల్ 16వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విశాఖ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ వేదికపైనే చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ తొలి విజయాన్ని అందుకుంది. అయితే కేకేఆర్ పై ఢిల్లీ గెలవడం అంత సులభం కాకపోవచ్చు. కేకేఆర్ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. దీంతో కేకేఆర్ స్ట్రెన్త్ ఏంటో ఇప్పటికే అర్థమైంది. సో కేకేఆర్ ఢిల్లీకి గట్టిపోటీ ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

విశాఖపట్నం గ్రౌండ్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు ఎంతగానో సహకరిస్తుంది. మంచి బౌన్స్ కారణంగా పిచ్ బౌలర్లను కూడా కన్సిడర్ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్‌లో అత్యధిక స్కోరింగ్‌ నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్ పై యార్కర్లు మరియు బౌన్సర్ల ద్వారా బ్యాటర్లను కట్టడి చేసే వీలుంది. ఫ్లాట్ పిచ్ కారణంగా స్పిన్‌కు వ్యతిరేకంగా బ్యాటర్లకు స్వేచ్ఛ లభిస్తుంది. ఈ పిచ్ కారణంగా ఢిల్లీ, కేకేఆర్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఫోర్లు,సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఈ పిచ్‌పై టాస్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఈ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 14 టీ20 మ్యాచ్‌లు జరగ్గా అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 7 సార్లు గెలుపొందగా, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు 7 సార్లు గెలిచింది.

We’re now on WhatsAppClick to Join

ఈ ఐపీఎల్ సీజన్లో ఈ పిచ్ పై ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో సీఎస్‌కే జట్టు 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విధంగా ఢిల్లీ, సీఎస్‌కే మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 362 పరుగులు నమోదయ్యాయి. ఢిల్లీ-కేకేఆర్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ అలాంటిదే రిపీట్ అవ్వొచ్చంటున్నారు పిచ్ అనలిస్టులు.ఇక ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ 14 మ్యాచ్‌లలో రాజస్థాన్ రాయల్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా, ముంబై ఇండియన్స్ అత్యంత విఫలమైన జట్టుగా నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ విజయం సాధించింది. ముంబై హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది.

Also Read: Fruit Custard: సమ్మర్ స్పెషల్.. ఫ్రూట్ కస్టర్డ్ఎంతో టేస్టీగా తయారు చేసుకోండిలా?