DC vs KKR: సాగర తీరంలో పరుగుల సునామీ… కోల్ కత్తా హ్యాట్రిక్ విక్టరీ

ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్ ఢిల్లీ కాపిటల్స్ పై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు సునీల్ నరైన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.

DC vs KKR: ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్ ఢిల్లీ కాపిటల్స్ పై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు సునీల్ నరైన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్(18) విఫలమైనా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇషాంత్ శర్మ వేసిన 4వ ఓవర్‌లో 26 పరుగులు పిండుకున్నాడు.

సునీల్ నరైన్ ధాటికి కేకేఆర్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. నరైన్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ విధ్వంసానికి రఘు వంశీ కూడా తోడవ్వడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ దూకుడుగా సాగింది. 25 బంతుల్లో రఘు వంశీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. సెంచరీ దిశగా సాగిన నరైన్‌ను మిచెల్ మార్ష్ ఔట్ చేశాడు. చివరలో ఆండ్రీ రస్సెల్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41, రింకూ సింగ్ 8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26 మెరుపులు మెరిపించారు. దీంతో కోల్ కత్తా 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది.ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా కేకేఆర్ చరిత్రకెక్కింది.

We’re now on WhatsAppClick to Join.

భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేక పోయింది.విభవ్ అరోరా 10 పరుగుల వద్ద పృథ్వీ షాను అవుట్ చేయడం ద్వారా ఢిల్లీకి తొలి షాక్ తగిలింది. పృథ్వీ షా తర్వాత మార్ష్ కూడా అవుటయ్యాడు. డేవిడ్ వార్నర్ కూడా నిరాశ పరిచాడు. అయితే కెప్టెన్ పంత్ ధాటిగా ఆడాడు. 25 బంతుల్లో 55 పరుగులు చేశాడు. చివరలో స్టబ్స్ కాసేపు మెరుపులు మెరిపించాడు. 32 బంతుల్లోనే 54 పరుగులు సాధించాడు. అతను ఔట్ అయ్యాక ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. చివరికి ఢిల్లీ 166 పరుగులకు ఆలౌట్ అయింది. కోల్ కత్తా బౌలర్లలో వైభవ్ 3 , వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు చేరింది.

Also Read: Karnataka: బోరుబావిలో రెండేళ్ల బాలుడు, కొనసాగుతున్న సహాయక చర్యలు