Site icon HashtagU Telugu

David Warner: ఐపీఎల్‌లో 500+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ వార్నర్

David Warner

2023 4image 18 57 364392187warner

David Warner: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో రికార్డుల మోత మోగుతుంది. స్టార్ ప్లేయర్స్ తమ ఖాతాలో అనేక రికార్డులను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే కోహ్లీ, మిశ్రా తమ ఖాతాల్లో అరుదైన రికార్డులను నమోదు చేయగా తాజాగా డేవిడ్ భాయ్ వచ్చి చేరాడు.

శనివారం చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై అదరగొట్టింది. ఓపెనర్లు చెలరేగిపోయారు. దీంతో మూడు వికెట్ల నష్టానికి చెన్నై 223 పరుగులతో ఢిల్లీ ముందు భారీ టార్గెట్ ఉంచింది. చెన్నై టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పేలవంగా మారింది. ఒక్క కెప్టెన్ డేవిడ్ వార్నర్ తప్ప ఏ బ్యాట్స్‌మెన్ కూడా జట్టు కోసం శ్రమించింది లేదు. రిలే రస్సో, ఎన్రిక్ నోర్కియా, కుల్దీప్ యాదవ్ సహా ఢిల్లీ జట్టు ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 77 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించి భారీ విజయాన్ని నమోదు చేసి ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. కాగా ఢిల్లీ తరుపున డేవిడ్ వార్నర్ (David Warner) అద్భుతంగ ఆడాడు. CSKపై 58 బంతులు ఎదుర్కొని 86 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. డేవిడ్ తన కెరీర్‌లో 61వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. లీగ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా వార్నర్ నిలిచాడు. ఐపీఎల్ సీజన్‌లో డేవిడ్ వార్నర్ 7వ సారి 500 ప్లస్ పరుగులు చేసాడు.

ఇక మ్యాచ్ విషానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండిట్లోనూ విఫలమైంది. చెన్నై తరుపున రితురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వే అద్భుతమైన అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు మరియు జట్టు 223 పరుగులు చేయడంలో గణనీయమైన సహకారం అందించారు.

Read More: IPL Playoff: ప్లే ఆఫ్ లెక్కలివే.. ఏ జట్టుకు ఛాన్సుందంటే..?