David Warner: కొంప ముంచుతున్న ఐపీఎల్

అశ్విన్‌తో జరిపిన చిట్ చాట్ లో వార్నర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత గడ్డపై ఐపీఎల్‌లో ఆడడం మాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు . ఇక్కడ పిచ్ మరియు ఫీల్డ్‌ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజానికి ఆస్ట్రేలియాలో కూడా నరేంద్ర మోడీ స్టేడియం లాంటి మైదానం ఉంది. మోడీ స్టేడియంలో ఆడుతున్నంతసేపు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడుతున్నామనే ఫీలింగ్ వస్తుందని చెప్పుకొచ్చాడు.

David Warner: గతేడాది సొంత గడ్డపై గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియ చేతిలో భారత్ ఓడిన విషయం తెలిసిందే. భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుత సెంచరీ సాధించాడు. వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియా ఓడిపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే మన గడ్డపై ఆస్ట్రేలియా ఎలా గెలుపొందిందో, అసలు ఆస్ట్రేలియా జట్టు వ్యూహం ఏంటో చెప్పాడు ఆసీస్ విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్. టీమిండియా దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవి అశ్విన్‌తో జరిపిన చిట్ చాట్ లో వార్నర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత గడ్డపై ఐపీఎల్‌లో ఆడడం మాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు . ఇక్కడ పిచ్ మరియు ఫీల్డ్‌ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజానికి ఆస్ట్రేలియాలో కూడా నరేంద్ర మోడీ స్టేడియం లాంటి మైదానం ఉంది. మోడీ స్టేడియంలో ఆడుతున్నంతసేపు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడుతున్నామనే ఫీలింగ్ వస్తుందని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి రెండు మైదానాల సరిహద్దులు దాదాపు ఒకేలా ఉన్నాయి. కాబట్టి భారత్ లో ఆడేటప్పుడు మేము ఎలాంటి సమస్యను ఎదుర్కోలేదు. అందుకే భారత బ్యాట్స్‌మెన్‌ లపై వీలైనన్ని ఎక్కువ పరుగులు తీయగలిగామని చెప్పాడు వార్నర్.

బౌండరీ పెద్దది కావడంతో ఆ దిశగానే పరుగులు తీసేందుకు వ్యూహంతో బరిలోకి దిగమన్నాడు. ఫలితంగా ఫైనల్‌లో భారత్‌పై విజయం సాధించగలిగాచెప్పాడు దిగ్గజం డేవిడ్ వార్నర్. ఇదిలా ఉంటే డేవిడ్ వార్నర్ ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడగా అందులో 6 గెలిచి మరో ఆరు మ్యాచ్ లు ఓడి 12 పాయింట్లు సాధించింది.

Also Read: MS Dhoni: అందుకే ధోనీ చివరిలో బ్యాటింగ్ కు వస్తున్నాడు