Site icon HashtagU Telugu

David Warner: డేవిడ్ వార్నర్ కు ఘనంగా వీడ్కోలు

David Warner

David Warner

David Warner: ఆస్ట్రేలియా విధ్వంసకారుడు డేవిడ్ వార్నర్(David Warner) ( 13 సంవత్సరాల తన టెస్ట్ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. సొంతగడ్డపై పాకిస్థాన్‌(Pakistan)తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా(Australia) 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెరీర్‌లో చివరి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 75 బంతుల్లో 7 ఫోర్లతో 57 పరుగులు సాధించి హాఫ్ సెంచరీతో కెరీర్‌ను ఘనంగా ముగించాడు.

డేవిడ్ వార్నర్ 13 సంవత్సరాల తన టెస్ట్ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. 2011లో టెస్ట్ ఫార్మెట్లోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్ 2024లో రిటైర్మెంట్ ప్రకటించాడు. పాకిస్థాన్ తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0తో క్లీన్ స్వీప్ చేసిన అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లంతా అతనికి అభినందనలు తెలుపగా ప్రేక్షకులంతా వార్నర్ కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో వార్నర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు.

ఆస్ట్రేలియా జట్టులో ఆడే అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నానని ఎమోషనలయ్యాడు.తన కెరీర్‌కు సహకరించిన కోచ్‌లు, సహచర ఆటగాళ్లు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. డేవిడ్ వార్నర్ 1986 అక్టోబర్ 27న ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని పాడింగ్టన్ లో జన్మించాడు.

2009లో వన్డేల్లోకి అడుగుపెట్టిన వార్నర్ సంప్రదాయ క్రికెట్ అయిన టెస్టుల్లోకి మాత్రం 2011లో ఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. తనదైన బ్యాటింగ్ తో వన్డేల్లో, టెస్టుల్లో, టీ20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఎన్నో నెలకొల్పాడు. తన క్రికెట్ కెరీర్లో ఎన్నో విజయాలు, ప్రశంసలు, అవార్డులు అందుకున్న వార్నర్ క్రికెట్ కెరీర్ లో ఓ మాయని మచ్చ ఏర్పడింది. 2018 మార్చిలో దక్షిణాఫ్రికా టూర్లో వార్నర్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడని విచారణలో తేలడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతనిపై రెండేళ్లు నిషేధం విధించింది .112 టెస్టుల్లో 8786 రన్స్ చేశాడు. ఇందులో 26 సెంచరీలు 3 డబుల్ సెంచరీలు , ఒక ట్రిపుల్ సెంచరీ , 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సో మొత్తానికి వార్నర్ టెస్ట్ మరియు వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పి క్రికెట్ లవర్స్ ని బాధపెట్టాడు.

Also Read: Aditya L1: చరిత్ర సృష్టించిన ఇస్రో .. హాలో ఆర్బిట్‌లోకి ఆదిత్య ఎల్‌-1

Exit mobile version