Site icon HashtagU Telugu

David Warner Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ వార్నర్

David Warner Retirement

David Warner Retirement

David Warner Retirement: బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయంతో ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలనే ఆస్ట్రేలియా కల చెదిరిపోయింది. ఈ సమయంలో ఆసీస్ క్రికెటర్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే వార్నర్ ఐపీఎల్‌తో సహా ఇతర లీగ్‌లలో ఆడటం కొనసాగించనున్నాడు.

డేవిడ్ వార్నర్ 2011లో న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత అతను ఆస్ట్రేలియా తరపున మూడు ఫార్మాట్లలో సత్తా చాటాడు. అతని టెస్ట్ కెరీర్ యావరేట్ అయినప్పటికీ వన్డే, టి20 ఫార్మాట్లలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచాడు. ఇది కాకుండా వార్నర్ ఐపీఎల్లోనూ అత్యంత విజయవంతమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వార్నర్ తన కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 2016 సీజన్ ఐపీఎల్ లో ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ప్రస్తుతం వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుపున ఆడుతున్నాడు.

డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టు మ్యాచ్‌ల్లో 44.6 సగటుతో 8786 పరుగులు చేశాడు. టెస్టు ఫార్మాట్‌లో డేవిడ్‌ వార్నర్‌ పేరిట 26 సెంచరీలు ఉన్నాయి. కాగా అతని పేరిట 3 డబుల్ సెంచరీలు కూడా నమోదయ్యాయి. ఇది కాకుండా అతను ఒకసారి టెస్టులో 300 పరుగుల మార్కును అధిగమించాడు. టెస్ట్ మ్యాచ్‌లలో 37 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు.

డేవిడ్ వార్నర్ 161 వన్డే మ్యాచ్‌లలో 97.26 స్ట్రైక్ రేట్ మరియు 45.01 సగటుతో 6932 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని పేరు మీద 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా తరపున వార్నర్ 110 టి20 మ్యాచ్‌లలో 139.77 స్ట్రైక్ రేట్ మరియు 40.52 సగటుతో 6565 పరుగులు చేశాడు. టీ20లో వార్నర్ ఒక సెంచరీ, 28 హాఫ్ సెంచరీలు సాధించాడు.

Also Read: Sanatana Dharma Row: మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్