David Warner: డేవిడ్‌ వార్నర్‌ సంచలన వాఖ్యలు.. రిటైర్మెంట్‌పై హింట్‌..!

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) సంచలన వాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో వార్నర్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నా అంతర్జాతీయ కెరీర్‌లో ఆఖరిది కావచ్చు.

Published By: HashtagU Telugu Desk
warner

Resizeimagesize (1280 X 720) (2) 11zon

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) సంచలన వాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో వార్నర్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నా అంతర్జాతీయ కెరీర్‌లో ఆఖరిది కావచ్చు. 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో రాణించి మా జట్టుకు టైటిల్‌ను అందించడమే లక్ష్యం. అప్పుడు గర్వంగా క్రికెట్‌ నుంచి తప్పుకుంటాను అని పేర్కొన్నాడు.

2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌పై నా దృష్టి ఉంది. ఒకవేళ నన్ను ఎంపిక చేస్తే ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తానని వార్నర్ చెప్పాడు. 2021 సంవత్సరంలో UAEలో జరిగిన T20 ప్రపంచ కప్‌లో వార్నర్ 289 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. భారత్‌లో జరగనున్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ పట్ల తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని గత నెలలో వార్నర్‌ చెప్పాడు.

Also Read: Bomb in Plane: విమానానికి బాంబు బెదిరింపు కాల్..అలర్ట్ అయిన అధికారులు

ఆస్ట్రేలియా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన డేవిడ్ వార్నర్ ఇటీవల దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ సాధించాడు. జో రూట్ తర్వాత తన 100వ టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌కు ముందు డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్‌లో ఇబ్బంది పడ్డాడు. దాదాపు మూడేళ్ల పాటు క్రికెట్‌లోని సుదీర్ఘ ఫార్మాట్‌లో వార్నర్ సెంచరీ చేయలేదు. ఇప్పుడు భారత గడ్డపై భారీ ఇన్నింగ్స్ లు ఆడి ఆస్ట్రేలియాను గెలిపించాలని డేవిడ్ వార్నర్ చూస్తున్నాడు. భారత్‌లో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ఏదైనా మ్యాచ్ గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంటుంది. సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో కూరుకుపోవచ్చు.

  Last Updated: 13 Jan 2023, 12:04 AM IST