Site icon HashtagU Telugu

Delhi Capitals: డేవిడ్ వార్నర్‌కు షాక్‌

David

David

ఐపీఎల్ మెగా వేలానికి ముందు అందరినీ ఆకర్షించిన ఆటగాడు ఆస్ట్రేలియా విధ్వంకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. సన్‌రైజర్స్‌ తరపున పలు సీజన్లలో అద్భుతంగా రాణించిన వార్నర్‌ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలో అతను భారీ ధర పలుకుతాడని అంతా ఊహించారు. అనూహ్యంగా ఫ్రాంచైజీలు మాత్రం వార్నర్‌కు షాకిచ్చాయి.

గతేడాది వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించిన వార్నర్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో నిలిచాడు. రెండు ఫ్రాంచైజీలు మాత్రమే వార్నర్‌ కోసం ఆసక్తి కనబరిచాయి. చివరికి ఈ ఆసీస్ ఓపెనర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో 41.59 బ్యాటింగ్ సగటుతో వార్నర్‌కు అద్భుతమైన రికార్డుంది. అంతేకాకుండా కెప్టెన్‌గానూ మంచి రికార్డుల‌ను ఉన్న డేవిడ్ వార్నర్ 2016 లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఇప్పటి వరకూ 50 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 41.2 సగటున 5449 పరుగులు చేసి లీగ్‌ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత సీజన్‌ మధ్యలో వార్నర్ పెద్దగా రాణించలేదు. దీంతో పాటు మేనేజ్‌మెంట్‌తో వచ్చిన విభేదాల కారణంగా పలు మ్యాచ్‌లలో తుది జట్టులోనూ చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో వేలానికి ముందై సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోకపోవడంతో వార్నర్ ఈ సారి కొత్త జట్టుకు ఆడనున్నట్టు అప్పుడే తేలిపోయింది. అయితే వార్నర్‌కు తక్కువ ధర రావడంపై మాజీ క్రికెటర్లు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Exit mobile version