Site icon HashtagU Telugu

ICC World Test Championship Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఎప్పుడంటే.?

icc

Resizeimagesize (1280 X 720) 11zon

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ (ICC World Test Championship Final) మ్యాచ్ తేదీ, వేదికను ఐసీసీ ఖరారు చేసింది. లండన్ లోని ఓవల్ స్టేడియంలో జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. ఒకవేళ అనివార్య కారణాలతో మ్యాచ్ రద్దైతే జూన్ 12ను రిజర్వ్ డేగా ప్రకటించింది. కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ తొలి ఎడిషన్ ను న్యూజిలాండ్ గెలుచుకుంది. ఫైనల్ లో భారత్ పై 8 వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో అంచె ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌ తేదీలను ఐసీసీ ప్రకటించింది. వర్షం లేదా మరే ఇతర కారణాల వల్ల ఆట రద్దైతే జూన్ 12ని రిజర్వ్ డేగా ఉంచారు. చివరి ఫైనల్‌లో రిజర్వ్ డే రోజునే మ్యాచ్ ఫలితం వెలువడింది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి ఫైనల్‌లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో ఈ మ్యాచ్ జరిగింది.

Also Read: Spin Challenge: కంగారూలకు స్పిన్ ఛాలెంజ్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక ప్రకారం ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఫైనల్ చేరేందుకు గట్టి పోటీదారులుగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు కూడా ఫైనల్ రేసులో ఉన్నప్పటికీ, ఈ రెండు జట్ల ఫైనల్స్‌కు చేరుకునే మార్గం చాలా కష్టం. ప్రస్తుత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది జట్ల పాయింట్ల పట్టికలో 75.56 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా తర్వాత భారత్ 58.93 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 9 నుండి నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఈ సిరీస్ ఫలితం టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడే జట్ల పేర్లను నిర్ణయిస్తుంది. శ్రీలంక (53.33%), దక్షిణాఫ్రికా (48.72%), పాయింట్లతో మూడు, నాల్గవ స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లూ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌లో శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉండగా, వెస్టిండీస్‌లో దక్షిణాఫ్రికా స్వదేశంలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.