Dale Steyn: కోహ్లీ పై స్టెయిన్ ట్వీట్ వైరల్!

మూడేళ్ల పాటు సెంచరీ చేయని కోహ్లీ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విరాట్ కెరీర్ ముగిసినట్టే అన్న వ్యాఖ్యలు వినిపించాయి.

Published By: HashtagU Telugu Desk
Dale Steyns

Dale Steyns

మూడేళ్ల పాటు సెంచరీ చేయని కోహ్లీ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విరాట్ కెరీర్ ముగిసినట్టే అన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఆసియా కప్ తో మళ్లీ మునుపటి ఫామ్ అందుకున్నాడు. ఆఫ్గనిస్తాన్ పై శతకం బాదిన కోహ్లీ ఓవరాల్ గా టోర్నీలో నిలకడగా రాణించాడు. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా పై ఫాం కొనసాగించాడు. ముఖ్యంగా సీరీస్ డిసైడర్ హైదరాబాద్ మ్యాచ్ లో అదరగొట్టాడు.

సూర్య కుమార్ యాదవ్ తో కలిసి కీలక పార్ట్ నర్ షిప్ తో సీరీస్ విజయాన్ని అందించాడు. ఇప్పుడు కోహ్లీ ఫాం పై మాజీ ఆటగాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సఫారీ మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ కోహ్లీ ని ఉద్దేసించి చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఎవరో ప్రపంచ కప్ కు ముందు ఫాం లోకి వచ్చారు అంటూ ట్వీట్ చేశాడు. తద్వారా ప్రత్యర్థి టీమ్స్ అలెర్ట్ గా ఉండాలన్న వార్నింగ్ ఇచ్చాడు. కోహ్లీతో కలిసి స్టెయిన్ గతంలో ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

  Last Updated: 26 Sep 2022, 10:48 PM IST