Site icon HashtagU Telugu

CWG Silver Medals: అథ్లెటిక్స్ లో మరో రెండు పతకాలు

Athletics Imresizer

Athletics Imresizer

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే హై జంప్, లాంగ్ జంప్ లో మెడల్స్ రాగా…తాజాగా మరో రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్ చేజ్ లో అవినాశ్ సేబుల్ , మహిళల 10 వేల మీటర వాక్‌లో ప్రియాంక గోస్వామి రజతాలు గెలుచుకున్నారు.

అవినాశ్ సేబుల్ సెకన్లలో 8 నిమిషాల 11 సెకన్లలో 3 వేల స్టీపుల్ చేజ్ ను పూర్తి చేసి సిల్వర్ మెడల్ సాధించాడు. తన గత జాతీయ రికార్డు 8.12.48 సెకన్ల రికార్డును అధిగమించాడు.మహారాష్ట్రలోని మాండ్వా జిల్లాలోని ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అవినాశ్ సేబుల్ గత కొంతకాలంగా అథ్లెటిక్స్ లో నిలకడగా రాణిస్తున్నాడు. మరోవైపు ప్రియాంక గోస్వామి 10 వేల మీటర్ల రేస్ వాక్‌ను తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు 43.38.83 సెకన్లలో పూర్తి చేసి రజతాన్ని కైవసం చేసుకుంది. తద్వారా రేస్ వాక్‌లో కామన్వెల్త్ పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా ప్రియాంక రికార్డు సృష్టించింది.

ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఇప్పటి వరకూ భారత్ 4 పతకాలు తన ఖాతాలో వేసుకుంది . ఫలితంగా 2018 గోల్డ్ కోస్ట్ అథ్లెటిక్స్ రికార్డును అధిగమించినట్లయింది. గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం గెలుచుకుంది. ఈసారి గేమ్స్‌లో తేజస్విని శంకర్ హైజంప్‌లో కాంస్యాన్ని సొంతం చేసుకోగా.. లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్ రజతం గెలిచాడు.