CWG Hockey: ఘనాపై భారత్ హాకీ జట్టు భారీ విజయం విజయం

కామన్ వెల్త్ గేమ్స్ మెడల్ హంట్ ను భారత హాకీ జట్టు గ్రాండ్ విక్టరీతో మొదలు పెట్టింది. పూల్‌-బిలో జరిగిన మ్యాచ్‌లో ఘనాపై ఏకంగా 11-0 తేడాతో భారీ విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - August 1, 2022 / 11:58 AM IST

కామన్ వెల్త్ గేమ్స్ మెడల్ హంట్ ను భారత హాకీ జట్టు గ్రాండ్ విక్టరీతో మొదలు పెట్టింది. పూల్‌-బిలో జరిగిన మ్యాచ్‌లో ఘనాపై ఏకంగా 11-0 తేడాతో భారీ విజయం సాధించింది. కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన అత్యంత భారీ విజయం ఇదే. 1998 గేమ్స్‌లో ట్రినిడాడ్‌పై భారత్‌ 10–1తో నెగ్గింది. ఈ మ్యాచ్ లో భారత్ ప్లేయర్స్ గోల్స్ వర్షం కురిపించారు.
వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్స్ గోల్స్ సాధించగా అభిషేక్ సింగ్, షంషేర్ సింగ్, అక్షదీప్ సింగ్, జుగ్ రాజ్ సింగ్, నీలకంఠశర్మ, వరుణ్ కుమార్, మన్ దీప్ సింగ్తలో ఒక్క గోల్ సాధించారు. మ్యాచ్ మొదలైన రెండో నిమిషంలోనే తనకు లభించిన పెనాల్టీ కార్నర్ ను అభిషేక్ గోల్ గా మలచడంతో ఇండియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పదకొండో నిమిషంలో హర్మన్ ప్రీత్, 14వ నిమిషంలో షంషేర్ గోల్స్ తో ఇండియా మ్యాచ్ పై పట్టు బిగించింది. ఫస్ట్ హాఫ్ లో నే 5-0 తో నిలిచినా ఇండియా రెండో క్వార్టర్ లో 4, మూడో క్వార్టర్ లో రెండు గోల్స్ తో విజయాన్ని పూర్తి చేసింది. ఎటాకింగ్ గేమ్ కు ప్రాధాన్యమిచ్చిన ఇండియన్ టీమ్ పదే పదే ఘనా గోల్ పోస్ట్ పై దాడులు చేసి వరుస గోల్స్ సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ కు 13 పెనాల్టీ కార్నర్స్ లభించగా వాటిలో ఆరింటిని గోల్ గా మలిచారు. ఘనా గోల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ భారత గోల్ కీపర్ శ్రీజేష్ అడ్డుగోడగా నిలిచాడు. అయిదు పెనాల్టీ కార్నర్స్ ను అడ్డుకున్నాడు. తన తదుపరి మ్యాచ్ లో ఇండియా ఇంగ్లాండ్ తో తలపడనుంది.