CWG 2022 Closing Ceremony: బై బై బర్మింగ్ హామ్…ముగింపు అదిరింది

ఒలింపిక్ గేమ్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన పోటీలు కామన్వెల్త్ గేమ్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 12:09 PM IST

ఒలింపిక్ గేమ్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన పోటీలు కామన్వెల్త్ గేమ్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా 72 దేశాలు పోటీ పడే ఈ క్రీడలకు ఈ సారి బర్మింగ్ హామ్ ఆతిథ్యం ఇచ్చింది. 11 రోజుల పాటు సాగిన ఈ పోటీలకు తెరపడింది. ఈ పోటీలు ముగియడంతో బర్మింగ్హామ్ అలెగ్జాండర్ స్టేడియం వేదికగా ముగింపు ఉత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి. బర్మింగ్హామ్ సంస్కృతికి అద్దం పట్టే రీతిలో ఘనంగా జరిగాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులతో బర్మింగ్హామ్ వీదులు వెలిగిపోయాయి. వేల మంది ఒకే సారి వీక్షిస్తున్న ఈ వేడుకలు గుర్తుండిపోయేలా నిర్వహించారు.
టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ శరత్ కమల్, బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్ ముగింపు వేడుకల్లో భారత ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు.
40ఏళ్ల శరత్ కమల్ ఈ కామన్‌వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతను పురుషులు, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ సాధించాడు. అలాగే పురుషుల డబుల్స్‌లో రజతం గెలుచుకున్నాడు. అలాగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో శరత్ కమల్ గోల్డ్ మెడల్ సాధించాడు.బాక్సింగ్‌లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ ఈ క్రీడల్లో దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఆదివారం జరిగిన 50కేజీల లైట్‌ ఫ్లై వెయిట్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించింది. దీంతో వీరిద్దరికీ ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇదిలా ఉంటే ముగింపు వేడుకలకు ప్రత్యేక అతిథులెవ్వరూ లేరు. పాపులర్ మ్యూజికల్ నంబర్స్, పర్ఫార్మెన్స్‌తో కామన్వెల్త్ చివరి రోజు రాత్రి మర్చిపోలేని రీతిలో జరిగింది. ఈ గేమ్స్ చాలా అద్భుతంగా జరిగాయని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ లూయిస్ చెప్పారు.97 కామన్వెల్త్ రికార్డులు, నాలుగు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారని గుర్తు చేశారు. ఈ పోటీల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి మొత్తం 61 మెడల్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.