Site icon HashtagU Telugu

IPL 2023: కోల్‌కతాకు షాక్.. ఆ ప్లేయర్లు ఔట్.!

91534421

91534421

ఐపీఎల్ మినీ వేలానికి ఫ్రాంచైజీలు బిజీగా ఉన్న వేళ పలువురు విదేశీ ఆటగాళ్ళు షాక్ ఇచ్చారు. వచ్చే ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో ఉండడం లేదంటూ స్పష్టం చేశారు. ఈ జాబితాలో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఎక్కువ దెబ్బ తగలిందని చెప్పాలి. కోల్ కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సామ్ బిల్లింగ్స్ , కమ్మిన్స్ , ఫించ్ వచ్చే సీజన్ నుంచి తప్పుకున్నారు. ఐపీఎల్ కంటే జాతీయ జట్టుకు ఆడేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. వచ్చే ఏడాది జరిగే యాషెస్‌ సిరీస్‌ కోసం ఫిట్‌గా ఉండేందుకు వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వీరిలో స్టార్క్‌ గతేడాదే ఐపీఎల్‌పై ఆసక్తి కనబరచలేదు. కాగా ఐపీఎల్ 16వ సీజన్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్ ఆప్ఘనిస్థాన్ కు చెందిన రహ్మానుల్లా గుర్భాజ్‌ , లోకీ ఫెర్గూసన్‌లను డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి, అలాగే టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి ట్రేడింగ్ ద్వారా తెచ్చుకుంది. వీరితోనే కమిన్స్‌, ఫించ్‌, సామ్‌ బిల్లింగ్స్‌ స్థానాలను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. కొచ్చి వేదికగా డిసెంబర్‌ 23న జరుగనున్న ఐపీఎల్‌ మినీ వేలం ముందు తది జాబితాను సమర్పించేందుకు గడువు నేటితో ముగియనుంది.