CSK vs SRH: వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో సన్ రైజర్స్

213 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస వికెట్లను సమర్పించుకుంది. ట్రావిస్ హెడ్ 13, అభిసశేక్ శర్మ 15, నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతో దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా 8 ఓవర్ల సమయానికి సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది.

CSK vs SRH: చెన్నై చెపాక్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. చెన్నై తరుపున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 98 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతికి 98 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అతడితో పాటు శివమ్ దూబే 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక రుతురాజ్ అవుట్ అయిన తర్వాత అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంఎస్ ధోని రంగంలోకి దిగాడు. మైదానంలో అడుగుపెట్టిన వెంటనే తొలి బంతికే ఫోర్ కొట్టిన ధోని 5 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి వెనుదిరిగాడు. చెన్నై ఇన్నింగ్స్ లో డారీ మిచెల్ 32 బంతుల్లో 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ నమోదైంది. ఓపెనర్ రహానే 9 పరుగులకే అవుట్ అయ్యాడు.

213 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస వికెట్లను సమర్పించుకుంది. ట్రావిస్ హెడ్ 13, అభిషేక్ శర్మ 15, నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతో దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా 8 ఓవర్ల సమయానికి సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం హెన్రిచ్ క్లాసేన్, మార్కరం క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరు నిలకడగా ఆడితే తప్ప హైదరాబాద్ గెలిచే అవకాశం లేదు.

We’re now on WhatsAppClick to Join

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ , డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ , దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా.

ఇంపాక్ట్ సబ్-సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ , నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నటరాజన్.

ఇంపాక్ట్ సబ్- ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్.

Also Read: CSK vs SRH: వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో సన్ రైజర్స్