CSK Vs SRH: చెపాక్ వేదికగా చెన్నై, హైదరాబాద్ మధ్య భీకర పోరు

చెన్నై, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డ్ ఎలా ఉన్నాయంటే ఐపీఎల్ లో ఇరు జట్లు మొత్తం 21 సార్లు తలపెడితే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 15 మ్యాచ్‌లు గెలవగా, హైదరాబాద్ 6 మ్యాచ్‌లు గెలిచింది.

CSK Vs SRH: ఈ సీజన్ ఐపీఎల్ రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే సగం మ్యాచ్ లు పూర్తయ్యాయి. కాగా ఈ రోజు ఆదివారం ఢబుల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి. టోర్నీలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం గుజరాత్ టైటాన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. సాయంత్రం చెన్నై చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ .. చెన్నై సూపర్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడగా అందులో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 4 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాగా చెన్నై వరుసగా గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని ఊవిళ్లూరుతోంది.

చెన్నై, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డ్ ఎలా ఉన్నాయంటే ఐపీఎల్ లో ఇరు జట్లు మొత్తం 21 సార్లు తలపెడితే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 15 మ్యాచ్‌లు గెలవగా, హైదరాబాద్ 6 మ్యాచ్‌లు గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఛేదనలో సీఎస్‌కే 9 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, హైదరాబాద్ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ 3వ ప్లేసులో ఉండగా, చెన్నై ఆరో స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్స్ రేసు ఆశలు నిలుపుకోవాలి అంటే రెండు జట్లకూ కూడా ఈ రోజు జరిగే మ్యాచ్ విజయం అవసరం.5 విజయాలు సాధించిన హైదరాబాద్.. మిగిలిన ఆరు మ్యాచుల్లో కనీసం 3 మ్యాచుల్లో గెలవాల్సి ఉంది. ఇక ఈ సీజన్‌ ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు అసాధారణ ప్రదర్శనతో దుమ్మురేపుతుంది. హైదరాబాద్ లోని టాపార్డర్ స్టాండ్ ఇస్తే భారీ స్కోర్ చేసేందుకు స్కోప్ ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హేన్రిచ్ క్లాసేన్, మార్కరం, ఫిలిప్స్ ఇలా భయంకరమైన బ్యాటింగ్ లైనప్ తో సన్ రైజర్స్ జట్టు పటిష్టంగా ఉంది.

We’re now on WhatsAppClick to Join

చెన్నై సూపర్ కింగ్స్ లో బ్యాటింగ్ దళం కలవరపెడుతుంది. అజింక్య రహానే త్వరగా పెవిలియన్ చేరుతుండటం జట్టుకు మైనస్ అవుతుంది. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న రవీంద్ర కూడా త్వరగానే అవుట్ అవుతున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మెరుగవ్వాల్సి ఉంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే వీరిద్దరూ ప్రస్తుతం నిలకడగా రాణిస్తున్నారు. చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడిన రెండు బంతుల్ని ఫోర్లు, లేదా సిక్సర్లతో సందడి చేస్తున్నాడు. అయితే చెన్నై జట్టు విజయానికి ఈ బ్యాటింగ్ లైనప్ క్లిష్టంగా మారింది. కాస్త మెరుగు పడితే చెన్నైని ఢీ కొట్టడానికి ప్రత్యర్థి జట్టు కష్టపడాల్సి వచ్చేది.

Also Read: Pawan Kalyan : ఆమె కోసం చంద్రబాబుని సహాయం అడిగిన పవన్.. నిర్మాత కామెంట్స్..