CSK vs PBKS: చెన్నై చెపాక్ లో కీలక పోరు.. చెన్నై vs పంజాబ్

చెన్నై చెపాక్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైండ్. ఈ పిచ్ పై చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్‌పై చెన్నై జాగ్రత్తగా ఆడాల్సి ఉందంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోగలుగుతుంది.

CSK vs PBKS: చెన్నై చెపాక్ లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు బుధవారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్‌పై చెన్నై జాగ్రత్తగా ఆడాల్సి ఉందంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఈ క్రమంలో చెన్నైకి మరో ఓటమి ఎదురైతే ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశలను దెబ్బతీస్తుంది.

నిలకడ లేమితో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్‌పై అన్న విభాగాల్లోనూ రాణించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా చెన్నై మెరుగు పడాల్సి ఉంది. గత మ్యాచ్ లలో చెన్నై తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని ఆడాల్సి ఉంది. గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ పరిస్థితుల్లో పంజాబ్‌పై చెన్నై జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మరోవైపు ఆతిథ్య జట్టు గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 78 పరుగుల తేడాతో సులభంగా విజయం సాధించింది.

చెపాక్ పిచ్ బౌలర్లుకు అనుకూలంగా ఉంటుంది. చెన్నై తరుపున ఫామ్‌లోకి వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై అందరి దృష్టి ఉంది. గైక్వాడ్ తన చివరి రెండు ఇన్నింగ్స్‌లలో 108 మరియు 98 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ కూడా హైదరాబాద్‌పై 32 బంతుల్లో 52 పరుగులు చేయడం చెన్నైకి కలిసొచ్చింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్‌లో శివమ్ దూబే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై విధ్వంసం సృస్టిస్తున్నాడు. సూపర్ కింగ్స్ ఓపెనింగ్ జోడీ అస్థిరంగా ఉంది. గైక్వాడ్ మంచి ప్రదర్శన రాబడుతున్నాడు కానీ రచిన్ రవీంద్ర మరియు అజింక్యా రహానే ఇద్దరూ జట్టుకు సహకారం అందించడం లేదు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రహానే గత నాలుగు ఇన్నింగ్స్‌లలో 05, 36, 01 మరియు 09 పరుగులు చేశాడు.

పంజాబ్ కింగ్స్ పటిష్టంగా కనిపిస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్‌పై విధ్వంసం సృష్టించిన జానీ బెయిర్‌స్టో, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లు చెన్నైపై విధ్వంసానికి రెడీ అవుతున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ నుండి జట్టు మరింత ఆకట్టుకునే ప్రదర్శనను కోరుకుంటుంది. రబడ, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కుర్రాన్ లాంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నప్పటికీ కగిసో కాస్త బలహీనంగా కనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. స్పిన్నర్లు హర్‌ప్రీత్ బ్రార్ మరియు రాహుల్ చాహర్ మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది.

We’re now on WhatsAppClick to Join

చెన్నై సూపర్కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని, అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఆర్ఎస్ హంగార్కర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నిశాంత్ సింధు, ముష్హర్ దేష్పన్, దీపక్ చాహర్, చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతిషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేష్ తీక్షణ మరియు సమీర్ రిజ్వీ.

పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడ్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కుర్రాన్, కగిసో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, రాహుల్ చహర్ , విద్వాత్ కావరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి మరియు రిలే రోసౌవ్.

Also Read: Minister Ponnam: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి పొన్నం