Site icon HashtagU Telugu

CSK vs LSG: చితక్కొట్టిన గైక్వాడ్, దూబే.. ధాటిగా ఆడుతున్న స్టోయినిస్‌..

GT vs CSK

CSK vs LSG

CSK vs LSG: చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే మరోసారి రెచ్చిపోయాడు. చెపాక్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దూబే చెన్నై బౌలర్లను చిత్తు చేశాడు. యశ్ ఠాకూర్ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది ప్రపంచానికి మరోసారి తన సత్తా చాటాడు. అతని ప్రదర్శన చూసి ధోనీ కూడా చాలా హ్యాపీగా కనిపించాడు.క్రమంలో దూబే చెన్నయ్ తరుపున 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో డ్వేన్ స్మిత్ రికార్డును బద్దలు కొట్టాడు.

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ అరాంభంలోనే వరుసగా వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్‌లు ఇన్నింగ్స్‌ బాధ్యతలు చేపట్టారు. రుతురాజ్ గైక్వాడ్ 60 బంతులు ఎదుర్కొని 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 22 బంతులు ఎదుర్కొన్న శివమ్ దూబే హాఫ్ సెంచరీ సాధించాడు . శివమ్ దూబే తన ఇన్నింగ్స్‌లో మొత్తం 7 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు. 244 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేసిన శివమ్ దూబే లక్నో బౌలర్లను చిత్తు చేశాడు.

ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో యశ్ ఠాకూర్ బౌలింగ్ చేశాడు. తన ఓవర్‌లో శివమ్ దూబే రెండు, మూడు, నాలుగో బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్‌లో శివమ్ దూబే తొలి బంతికే సిక్సర్ బాదాడు, అయితే ఆ ఓవర్ నాలుగో బంతికి అతను రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ రంగంలోకి దిగాడు. ధోనీ ఒక బంతి ఎదుర్కొని ఒక బౌండరీ కొట్టాడు. కాగా చెన్నై నిర్ణీత 20 ఓవర్ల నాటికి 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.

We’re now on WhatsAppClick to Join

211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో లక్నోకి ఆరంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే స్టార్ బ్యాట్స్ మెన్ క్వింటన్ డికాక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.చాహర్ వేసిన బంతిని డికాక్ ఆపే క్రమంలో టైమింగ్ కుదరక వికెట్ సమర్పించుకున్నాడు. 14 బంతుల్లో 16 పరుగులు చేసిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో మార్కస్ స్టోయినిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కష్టాల్లో ఉన్న లక్నో జట్టు బాధ్యతను తీసుకున్న మార్కస్ స్టోయినిస్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. 12 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ స్కోరు బోర్డులో 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.ప్రస్తుతం మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ క్రీజులో ఉన్నారు.

Also Read: CSK vs LSG: చితక్కొట్టిన గైక్వాడ్, దూబే.. ధాటిగా ఆడుతున్న స్టోయినిస్‌..

Exit mobile version