Site icon HashtagU Telugu

CSK vs KKR: చెపాక్‌లో గేమ్ ఛేంజర్ ఎవరు ?

CSK vs KKR

CSK vs KKR

CSK vs KKR: చెపాక్ లో చెన్నైని మట్టికరిపించేందుకు కేకేఆర్ సిద్ధమవుతుంటే, చెన్నై సూపర్ కింగ్స్ తమ హోమ్‌ గ్రౌండ్‌ అడ్వాంటేజ్‌తో బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ బరిలోకి దిగుతుండగా చెన్నై నాలుగు మ్యాచ్ లు ఆడి అందులో రెండు గెలిచి, మరో రెండిట్లో ఓటమి పాలైంది. దీంతో కేకేఆర్ పై విజయం సాధించి మళ్ళీ విజయాలబాట పట్టాలని గైక్వాడ్ సేన ఊవిళ్లూరుతోంది.

చెన్నై తరుపున కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర పవర్‌ప్లేలో దూకుడుగా ఆడితే చెన్నై భారీ స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. శివమ్ దూబే 160.86 స్ట్రైక్ రేట్‌తో మంచి టచ్‌లో ఉండడం చెన్నైకి కలిసిరానుంది. ఇక చెన్నై పేసర్లపైనే హోప్స్ పెట్టుకుంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరాణలు చెలరేగితే కేకేఆర్ వికెట్ల పతనం తప్పదు. స్పిన్నర్లు మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేశ్ తీక్షణతో పాటు దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరిలచతో చెన్నై స్పిన్‌ దళం బలంగా ఉంది. ఇక జట్టుకు అవసరమైన సమయంలో జడేజా బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఇక ధోనీ త్వరగా బ్యాటింగ్ కి రావాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తుంది. టాపార్డర్ నుంచి మిడిల్, మరియు చివరి వరకు బ్యాటర్లు స్థాయికి తగ్గ ఆటతీరుతో రాణిస్తుండడం ఆ జట్టుకు కలిసి వస్తోంది. ఈ సారి సునీల్ నరైన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ కొనసాగిస్తే కేకేఆర్ భారీ స్కోరుకు పెద్దగా కష్టపడాల్సి అవసరం ఉండకపోవచ్చు. అయ్యర్, రమణదీప్ సింగ్‌లతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్ ఫైనల్ టచ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక హర్షిత్ రాణా, రస్సెల్, వైభవ్ అరోరా, మిచెల్ స్టార్క్ మరియు వరుణ్ చక్రవర్తిలతో కోల్‌కత్తా బౌలింగ్ దళం గురించి తెలిసిందే. .2008 నుంచి ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌-కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ 31 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. చెన్నై 19సార్లు గలిస్తే కోల్‌కత్తా 11 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.

We’re now on WhatsAppClick to Join

చెన్నై చెపాక్‌ స్టేడియంలో ఇరు జట్లు 10 మ్యాచులు ఆడగా చెన్నై ఏడుసార్లు, కోల్‌కత్తా మూడు విజయాలు నమోదు చేసింది. అయితే చెపాక్‌ లో ఇప్పటివరకు చెన్నై 66 మ్యాచులు ఆడగా 47 విజయాలు నమోదు చేసింది. 18 మ్యాచుల్లో ఓడిపోయింది. చెపాక్‌లో కోల్‌కత్తా 13 మ్యాచులు ఆడగా నాలుగు మ్యాచుల్లో గెలిచి 9 సార్లు ఓడిపోయింది. చెపాక్ పిచ్ ఫాస్ట్ బౌలర్‌లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది చెపాక్‌లో సీమర్లు 28 సగటుతో 18 వికెట్లను తీశారు. స్పిన్నర్లు నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 189. గత మూడేళ్లలో 21 మ్యాచ్‌ల్లో సగటు స్కోరు 164. కాగా కోల్కత్త ఈ ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో ఓవర్‌కి 12 పరుగులతో దూసుకుపోతోంది. కాబట్టి కోల్‌కత్తా బ్యాటర్లు కాస్త ఓపిక ప్రదర్శిస్తే భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా కోల్‌‌కత్తా నైట్ రైడర్స్ వరస విజయాలతో ఊపు మీదుండగా, చెన్నై మాత్రం ఆపసోపాలు పడుతుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరిది విజయం సాధిస్తారు అన్న దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ రెండు బలమైన జట్లలో మీ ఫేవరేట్ జట్టేన్తో కామెంట్ చేయండి.

Also Read: AP : సిట్ ఆఫీస్ లో చంద్రబాబుకు సంబదించిన కీలక పత్రాలను తగలబెట్టిన సీఐడీ అధికారులు

Exit mobile version