Site icon HashtagU Telugu

CSK vs KKR: 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

CSK vs KKR

CSK vs KKR

CSK vs KKR: చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. తుషార్, రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్ రెహమాన్ 2 వికెట్లు తీశారు. కేకేఆర్ తరఫున సునీల్ నరైన్ 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, అంగ్క్రిష్ రఘువంశీ 24 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరూ తప్ప మరే ఇతర బ్యాట్స్‌మెన్‌ కూడా రాణించలేకాపోయారు. ఫలితంగా జట్టు స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది.

138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు మూడు ఓవర్ల వరకు నిలకడగా ఆడుతూ కనిపించారు. తొలి ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే రాబట్టినా రెండో ఓవర్లో రచిన్ రవీంద్ర బ్యాట్ ఝళిపించాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఈ ఓవర్లో రచిన్ రవీంద్ర మూడు ఫోర్లు బాదాడు. 3 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 26 పరుగులు చేసింది. అయితే మూడో ఓవర్లో చెన్నైకి తొలి దెబ్బ తగిలింది. వైభవ్ అరోరా రచిన్ రవీంద్రకు పెవిలియన్ దారి చూపించాడు. రచిన్ 8 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగిపోయాడు. వరుస బౌండరీలతో మోత మోగిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్ ఉన్నారు.

చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.

కేకేఆర్ జట్టు: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

Also Read: CSK vs KKR: 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై