ఐపీఎల్లో (IPL) అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఒకటి. సిఎస్కె (CSK) ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2019 వరకు చెన్నైప్లేఆఫ్‌కు చేరుకునే పరిస్థితి ఉండేది. అయితే 2020లో తొలిసారిగా ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. దీంతో అప్పటి చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni) మ్యాజిక్ పని చేయడం లేదని విమర్శలు వినిపించాయి. అయితే నెక్స్ట్ సీజన్లో తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు ధోనీ. చెన్నైని మరోసారి ఛాంపియన్ గా నిలబెట్టాడు.
2021లో ధోనీ చెన్నైకి నాలుగో ఐపీఎల్ టైటిల్ తెచ్చిపెట్టాడు. అక్టోబర్ 15న దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి చెన్నై టైటిల్ గెలుచుకుంది. వాస్తవానికి ఐపిఎల్ వేసవిలో నిర్వహించబడుతుంది. అయితే కోవిడ్ కారణంగా ఆ సీజన్ ఐపీఎల్ యూఏఈలో జరిగింది. ఈ సీజన్‌లో చెన్నై టైటిల్ గెలవడంలో ఫాఫ్ డు ప్లెసిస్ మరియు రీతురాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషించారు. గైక్వాడ్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గైక్వాడ్ 635 పరుగులు చేయగా, డుప్లెసిస్ 633 పరుగులు చేశాడు.ఫైనల్‌లో డు ప్లెసిస్, గైక్వాడ్లు తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా బలమైన ఆరంభాన్ని అందించారు. 32 పరుగుల వద్ద గైక్వాడ్ ఔటయ్యాడు. ఆ తర్వాత డుప్లెసిస్ జట్టు బాధ్యతలు స్వీకరించాడు. ధనాధన్ షాట్లతో విరుచుకుపడుతూ డుప్లెసిస్ 86 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు మరియు మూడు సిక్సర్లు బాదాడు. రాబిన్ ఉతప్ప 31 పరుగులు, మొయిన్ అలీ 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ భారీ ఇన్నింగ్స్‌ల ఆధారంగా చెన్నై మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
చెన్నై బ్యాటర్ల అనంతరం బౌలర్లు కూడా అద్భుతాలు చేశారు. శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్‌లు కోల్ కత్తాకు అద్భుత ఆరంభాన్నిచ్చారు. ఒకానొక సందర్భంలో మ్యాచ్ కేకేఆర్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనిపించింది. అయితే ఈ ఇద్దరు ఔట్ అయిన వెంటనే, మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. గిల్, అయ్యర్‌లు తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించారు. అయ్యర్‌ను అవుట్ చేయడం ద్వారా శార్దూల్ ఠాకూర్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో అయ్యర్ 50 పరుగులు చేశాడు. గిల్ 43 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. ఇక్కడి నుంచి మళ్లీ చెన్నై బౌలింగ్ ఆధిపత్యం చెలాయించడంతోపాటు వరుసగా వికెట్లు తీస్తూకేకేఆర్ ని కష్టాల్లోకి నెట్టింది. కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై తరఫున ఠాకూర్ మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. దీపక్ చాహర్, డ్వేన్ బ్రావోలకు చెరో వికెట్ దక్కింది.