IPL 2023: ఐపీఎల్ లో అదరగొడుతున్న పతిరానా

ఐపీఎల్ సీజన్ 16లో చెన్నై సూపర్ కింగ్స్ బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది.

Published By: HashtagU Telugu Desk
IPL 2023

New Web Story Copy (95)

IPL 2023: ఐపీఎల్ సీజన్ 16లో చెన్నై సూపర్ కింగ్స్ బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. కాగా జట్టులోని పలువురు ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కూడా ఈ ఐపీఎల్ చాలా ప్రత్యేకమైనది. గత మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రవీంద్ర జడేజాకు దక్కినా.. జట్టు విజయం సాధించిన ఘనత మరో ఆటగాడిదే.

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మతిషా పతిరానా చివరి ఓవర్‌లో మొత్తం ఇన్నింగ్స్‌నే బోల్తా కొట్టించి తన జట్టును గెలిపించాడు. ఐపీఎల్ 16లో 8 మ్యాచ్‌ల్లో డెత్ ఓవర్‌లో మతిషా పతిరానా 7.86 ఎకానమీ రేట్‌తో మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. తన అద్భుతమైన బౌలింగ్ చేసి చెన్నైకి విజయాన్ని అందించాడు. దీని కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీని 27 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. మరోవైపు ఢిల్లీ ఓటమితో దాదాపు ఐపీఎల్ 16కి దూరమైనట్టే.

ఢిల్లీపై పతిరానా 4 ఓవర్లలో 4/37 తీసుకున్నాడు. ఒకప్పుడు పతిరానా బౌలింగ్ యాక్షన్‌ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అతని బౌలింగ్ యాక్షన్ క్రికెట్ కి విరుద్ధంగా ఉందంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. లసింత్ మలింగ మాదిరిగా పతిరానా యాక్షన్ ఉన్నట్టు కామెంట్స్ వినిపించాయి. అయితే ముంబై ఇండియన్స్‌పై 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

Read More: Rayudu political entry : అంబ‌టి రాయుడు YCP గుంటూరు గ్రౌండ్లోకి..?

  Last Updated: 11 May 2023, 04:15 PM IST