IPL 2024 : బోణీ కొట్టిన CSK

బెంగళూరు ఫై 6 వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్ బోణి కొట్టింది

Published By: HashtagU Telugu Desk
Csk Won 2024

Csk Won 2024

ఐపీఎల్ 2024 (IPL 2024)మొదటి మ్యాచ్‎లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘన విజయం (Won ) సాధించింది..బెంగళూరు ఫై 6 వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్ బోణి కొట్టింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 ఆరంభమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఐపీఎల్-2024 అట్టహాసంగా ప్రారంభమైంది. ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ప్రాఫ్ డాన్సులు, ఏఆర్ రెహమాన్, సోను నిగమ్ పాటలతో ఉర్రూతలూగించారు. కళ్లు జిగేల్మనిపించే లైట్లు, లేజర్ షోలు, బాణసంచా విన్యాసాలు గ్రాండ్ గా వెల్ కామ్ చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు నమోదు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. RCB విసిరినా టార్గెట్ ను చెన్నై సూపర్ కింగ్స్ 18 .4 ఓవర్లలో ఛేదించి అభిమానుల్లో ఉత్సహం నింపింది. జట్టులో రవీంద్ర (37), రహానే (27) తో రాణించారు. చివర్లో శివమ్ (34), జడేజా (25) పరుగులు సాధించి జట్టును విజయ పథంలోకి తీసుకొచ్చారు. బెంగళూరు బ్యాటర్లలో అనూజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ (38), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (35) ఫర్వాలేదనిపించారు. చెన్నై బ్యాటర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ అత్యధికంగా 4 కీలకమైన వికెట్లు తీశాడు. ఇక 2008 నుండి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించలేకపోతుంది. చెన్నై గడ్డపై చివరిసారి ఆర్‌సీబీ 2008లో గెలిచింది. ఆ తర్వాత నుండి ఇప్పటివరకు తమిళ స్టేడియంలో చెన్నైపై బెంగళూరు గెలవలేకపోయింది. ఈరోజు కూడా అదే జరిగింది.

ఇక ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సంచలన రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 6 పరుగులు చేసి తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించాడు. కోహ్లీ టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు పూర్తి చేశాడు (అంతర్జాతీయ + డొమెస్టిక్ T20 + ఫ్రాంచైజ్ లీగ్). ఇంతకు ముందు టీ20 క్రికెట్‌లో కేవలం 5 మంది బ్యాట్స్‌మెన్ మాత్రమే 12000 పరుగులను అధిగమించగలిగారు. భారత్‌ నుంచి ఏ బ్యాట్స్‌మెన్ నెలకొల్పని రికార్డు ను కోహ్లీ తన పేరిట నెలకొల్పి సరికొత్త రికార్డు (Virat Kohli Record) సృషించాడు.

Read Also : Devara 2nd Heroine : దేవర టీం కు భారీ షాక్ ఇచ్చిన హీరోయిన్..తలపట్టుకున్న మేకర్స్

  Last Updated: 23 Mar 2024, 12:12 AM IST