Dhoni IPL 2024: ధోనీ భవిష్యత్తు ఐపీఎల్ పై చెన్నై సీఈఓ క్లారిటీ

భారత మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ధోనీ ఎప్పుడు ఐపీఎల్ ఫార్మేట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తాడోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Dhoni IPL 2024: భారత మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ధోనీ ఎప్పుడు ఐపీఎల్ ఫార్మేట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తాడోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వన్డే, టీ20 ఫార్మేట్లకు సైలెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, ఐపీఎల్ పై కూడా అదే నిర్ణయం తీసుకుంటాడా లేదా అనేది ధోనీ చేతిలో ఉంది. ఇదిలా ఉండగా ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్ భవిష్యత్తుపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ (CSK CEO) మౌనం వీడారు.

ఎంఎస్ ధోని ఐపీఎల్ భవిష్యత్తు (Dhoni IPL 2024)పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ మౌనం వీడారు. ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోని నాయకత్వం వహిస్తాడా లేదా అన్నదానిపై విశ్వనాథన్ స్పదించాడు. అలాగే తన గాయం గురించి డాక్టర్‌ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ధోనీ ఎడమ మోకాలి గాయానికి వైద్యుడి సలహా తీసుకొని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటాడని తెలిపారు. ధోనీ మోకాలి శస్త్రచికిత్స అనంతరం, డాక్టర్ సలహాలు, నివేదికల అనంతరం భవిష్యత్తు నిర్ణయం ఉంటుందని విశ్వనాధ్ తెలిపారు. అయితే వచ్చే సీజన్లో ఆడాలా వద్దా అనేది పూర్తిగా ధోనీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెన్నై ప్రాంచైజీ సీఈఓ అన్నారు.

ఐపీఎల్ 2023 సీజన్ లో ధోనీ గాయంతో ఆడినట్టు చెన్నై సీఈఓ తెలిపారు. అభిమానులకోసమే ధోనీ కఠిన నిర్ణయాలు తీసుకుని కొనసాగుతున్నాడని పేర్కొన్నారు. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి ప్రస్తుతానికి ఆలోచన లేదని స్పష్టం చేశారు.

Read More: MS Dhoni Tears: ధోనీ కళ్ళలో నీళ్లు.. వీడియో వైరల్