Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

ఇండియన్ సూపర్ లీగ్‌లో (ISL) గోవా ఎఫ్‌సీ ప్రదర్శన ఇప్పటివరకు అంతగా బాగా లేదు. గోవా ఎఫ్‌సీ ప్రస్తుతం గ్రూప్ డీలో మూడవ స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో 3 ఓటములతో గోవా నిరాశపరిచే ప్రదర్శన కనబరిచింది.

Published By: HashtagU Telugu Desk
Cristiano Ronaldo

Cristiano Ronaldo

Cristiano Ronaldo: భారతీయ ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త వినిపించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఫుట్‌బాలర్ క్రిస్టియానో ​​రొనాల్డో (Cristiano Ronaldo) ఎఫ్‌సీ గోవా జట్టుకు వ్యతిరేకంగా ఆడటానికి సిద్ధమవుతున్నారు. నివేదికల ప్రకారం.. రాబోయే ఏఎఫ్‌సీ ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ డీ మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవాను ఎదుర్కోవడానికి రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ అల్-నాసర్ జట్టులో ఎంపికయ్యారు. ఈ వార్త భారతీయ ఫుట్‌బాల్ అభిమానులకు ఒక గొప్ప వార్తగా చెప్పవచ్చు.

మ్యాచ్ ఎప్పుడు?

ఈ మ్యాచ్ బుధవారం అంటే ఈరోజు సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరగనుంది. దీని కంటే ముందు రివర్స్ లెగ్ సందర్భంగా రొనాల్డో భారత గడ్డపై గోవాలో ఆడతారని భారతీయ అభిమానులు ఆశించారు. కానీ అది జరగలేదు. సౌదీ అరేబియా ఔట్‌లెట్ అల్-రియాదియాహ్ నుండి ఈ తాజా అప్‌డేట్ వచ్చింది. రొనాల్డో ఎఫ్‌సీ గోవాను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. గతంలో అల్-నాసర్ ప్రధాన కోచ్ జార్జ్ జీసస్, క్లబ్ రొనాల్డోను అనవసరమైన శారీరక శ్రమ నుంచి రక్షించడానికి ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా బిజీగా ఉన్న దేశీయ, ఖండాంతర షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని, గోవాతో మ్యాచ్‌లో అతను ఆడలేకపోయారని సూచనలు ఇచ్చారు.

Also Read: Sajjala Bhargav Reddy : భార్గవ రెడ్డికి కీలక పదవి అప్పగించిన జగన్

ఇండియన్ సూపర్ లీగ్‌లో ఎఫ్‌సీ గోవా ప్రదర్శన

ఇండియన్ సూపర్ లీగ్‌లో (ISL) గోవా ఎఫ్‌సీ ప్రదర్శన ఇప్పటివరకు అంతగా బాగా లేదు. గోవా ఎఫ్‌సీ ప్రస్తుతం గ్రూప్ డీలో మూడవ స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో 3 ఓటములతో గోవా నిరాశపరిచే ప్రదర్శన కనబరిచింది.

క్రిస్టియానో ​​రొనాల్డో త్వరలో రిటైర్మెంట్?

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో ​​రొనాల్డో త్వరలోనే రిటైర్ అవుతానని ప్రకటించారు. తన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలకడం చాలా కష్టమైనప్పటికీ, 40 ఏళ్ల ఈ ఆటగాడు ఫుట్‌బాల్ అనంతర జీవితం కోసం కొంతకాలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అల్ నాసర్ (Al Nassr) స్ట్రైకర్‌ అయిన రొనాల్డో క్లబ్, దేశం తరఫున కలిపి ఇప్పటివరకు మొత్తం 952 గోల్స్‌తో ఆల్-టైమ్ లీడింగ్ గోల్‌స్కోరర్‌గా ఉన్నారు. ఆట నుంచి వైదొలగే ముందు 1,000 గోల్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన గత నెలలో తెలిపారు.

  Last Updated: 05 Nov 2025, 05:08 PM IST