Cristiano Ronaldo: స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఫోర్బ్స్ 2025 ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన 50 మంది అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అతను మే 2024 నుండి మే 2025 మధ్య 275 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఈ ర్యాంకింగ్‌లో అతను వరుసగా మూడో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచాడు. టాప్ 50 అథ్లెట్లు సమిష్టిగా రికార్డు స్థాయిలో 4.23 బిలియన్ డాలర్లు సంపాదించారు. ఇది గత సంవత్సరం 3.88 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. లియోనెల్ మెస్సీ 135 మిలియన్ డాలర్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఏ మహిళా అథ్లెట్ కూడా చోటు సంపాదించలేదు. కోకో గాఫ్ 19.2 మిలియన్ డాలర్లతో స్వల్ప తేడాతో జాబితాలో చేరలేకపోయింది. అదే విధంగా ఈ సంవత్సరం ఏ భారతీయ అథ్లెట్ కూడా ఈ ర్యాంకింగ్‌లో చోటు సంపాదించలేదు.
Also Read: Donald Trump In UAE: అరబ్ సంప్రదాయాలతో ట్రంప్‌కు స్వాగతం – వైరల్‌గా మారిన అబూదాబీ డ్యాన్స్ వీడియో
అత్యధికంగా సంపాదించిన టాప్ 10 అథ్లెట్లు
- క్రిస్టియానో రొనాల్డో (ఫుట్‌బాల్) – 275 మిలియన్ యుఎస్ డాలర్లు
- స్టీఫెన్ కర్రీ (బాస్కెట్‌బాల్) – 156 మిలియన్ యుఎస్ డాలర్లు
- టైసన్ ఫ్యూరీ (బాక్సింగ్) – 146 మిలియన్ యుఎస్ డాలర్లు
- డాక్ ప్రెస్కాట్ (ఎన్‌ఎఫ్‌ఎల్) – 137 మిలియన్ యుఎస్ డాలర్లు
- లియోనెల్ మెస్సీ (ఫుట్‌బాల్) – 135 మిలియన్ యుఎస్ డాలర్లు
- లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్‌బాల్) – 133.8 మిలియన్ యుఎస్ డాలర్లు
- జువాన్ సోటో (బేస్‌బాల్) – 114 మిలియన్ యుఎస్ డాలర్లు
- కరీం బెంజెమా (ఫుట్‌బాల్) – 104 మిలియన్ యుఎస్ డాలర్లు
- షోహీ ఓహ్తానీ (బేస్‌బాల్) – 102.5 మిలియన్ యుఎస్ డాలర్లు
- కెవిన్ డ్యూరాంట్ (బాస్కెట్‌బాల్) – 101.4 మిలియన్ యుఎస్ డాలర్లు