Site icon HashtagU Telugu

2023 Retired Cricketers: ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ఆటగాళ్లు వీళ్ళే..

2023 Retired Cricketers

2023 Retired Cricketers

2023 Retired Cricketers: న్యూ ఇయర్ కి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. కానీ ఈ ఏడాదిని క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే వరల్డ్‌ కఫ్‌ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడం అత్యంత చేదు జ్ఞాపకంగా భావిస్తున్నారు. మరో బాధాకర విషయం ఏంటంటే ఈ ఏడాది చాలా మంది ఆటగాళ్లు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కొందరు వన్డేలకు గుడ్‌ బై చెబితే, మరికొందరు టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్ ప్రిటోరియస్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనితో పాటు లెజెండరీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక 2007లో టీమిండియాను టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిపిన జోగిందర్ శర్మ కూడా ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. మురళీ విజయ్, మనోజ్ తివారీ, అంబటి రాయుడు కూడా ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లండ్‌కు చెందిన మొయిన్ అలీ కూడా ఈ సంవత్సరం క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశారు. ప్రపంచ కప్‌ సమయంలో కూడా చాలా మంది ఆటగాళ్ళు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ ,దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ కూడా ప్రపంచ కప్ తర్వాత రిటైరయ్యారు.

Also Read: Ghee With Empty Stomach: ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల ప్రయోజనాలు..