Site icon HashtagU Telugu

Prithvi Shaw : ప్రియురాలితో పృథ్వీ షా హ‌ల్‌చ‌ల్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఫొటో..

Cricketer Prithvi Shaw with his girlfriend Nidhi Tapadia attended to IIFA Awards at Dubai

Cricketer Prithvi Shaw with his girlfriend Nidhi Tapadia attended to IIFA Awards at Dubai

టీమిండియా బ్యాట‌ర్‌, ఐపీఎల్‌(IPL)లో ఢిల్లీ క్యాపిట‌ల్ స్టార్ పృథ్వీ షా(Prithvi Shaw) త‌న ప్రియురాలి నిధి త‌పాడియా(Nidhi Tapadia)తో క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఐఐఎఫ్ఏ(IIFA) అవార్డుల కార్య‌క్ర‌మంలో వారిద్ద‌రూ క‌లిసి హ‌ల్ చ‌ల్ చేశారు. పృథ్వీషా, నిధి త‌పాడియా ఇద్ద‌రూ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. శుక్ర‌వారం ఐఐఎఫ్ఏ షోలో మొద‌టిసారి వారిద్ద‌రూ క‌లిసి పాల్గొన్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. పృధ్వీ షా స్లీవ్‌లెస్ జాకెట్‌, న‌ల్ల‌చొక్కా, న‌ల్ల జీన్స్ , త‌ల‌పై న‌ల్ల‌టి క్యాప్ ధ‌రించాడు. త‌పాడియా న‌ల్ల‌టి చీర‌లో క‌నిపించింది. వీరిద్ద‌రూ ఫొటోల‌కు ఫోజులిస్తూ క‌నిపించారు.

పృథ్వీ షా స్నేహితురాలు నిధి త‌పాడియా మ‌హారాష్ట్ర‌లో జ‌న్మించారు. ఆమె న‌టి, మోడ‌ల్‌. 2016లో టెలివిజ‌న్ న‌టిగా కేరీర్‌ను ప్రారంభించింది. క్రైమ్ షో సీఐడీలో నిధి న‌టించింది. పంజాబీ పాట జ‌ట్టాకోకా 2019లో విడుద‌లైన త‌రువాత పాపుల‌ర్ అయ్యారు. ఆమె యాద్ క‌ర్కే (2019), సోన్ డిఐ డబ్బీ (2020)లో కూడా నటించింది.

పృథ్వీ షా ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టులో ఆడాడు. అయితే, అంత‌గా రాణించ‌లేక పోయాడు. అత‌ని పేల‌వ‌మైన ఫామ్ కార‌ణంగా ప్లేయింగ్ 11 నుంచి కొన్ని మ్యాచ్‌ల త‌రువాత జ‌ట్టు మేనేజ్‌మెంట్ షాను తొల‌గించింది. చివ‌రిలో కొన్ని మ్యాచ్‌ల్లో అవ‌కాశం ల‌భించింది. పంజాబ్ కింగ్స్ పై అర్థ సెంచ‌రీ చేశాడు. ఈ సీజ‌న్‌లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన షా.. కేవ‌లం 106 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు.