Rishabh Pant Car Accident: రిషబ్ పంత్ కారు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. డబ్బు, నగలు దొంగతనం..!

శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రూర్కీ సమీపంలో డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంత్ డ్రైవింగ్ చేస్తూ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఫలితంగా కారుపై తన నియంత్రణను కోల్పోయాడు. దింతో పంత్ ప్రయాణిస్తున్న BMW కారు డివైడర్‌ను ఢీకొట్టింది.

  • Written By:
  • Publish Date - December 30, 2022 / 01:01 PM IST

శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రూర్కీ సమీపంలో డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంత్ డ్రైవింగ్ చేస్తూ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఫలితంగా కారుపై తన నియంత్రణను కోల్పోయాడు. దింతో పంత్ ప్రయాణిస్తున్న BMW కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో పంత్ ఒక్కడే ఉన్నాడని, దగ్ధమైన వాహనం నుంచి తప్పించుకోవడానికి కిటికీ పగలగొట్టాల్సి వచ్చిందని ఉత్తరాఖండ్ పోలీస్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. హరిద్వార్ జిల్లాలోని మంగళూర్- నర్సన్ మధ్య పంత్ కారు ప్రమాదానికి గురైంది. రూర్కీ సివిల్ హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స పొందిన తర్వాత అతన్ని మాక్స్ హాస్పిటల్ డెహ్రాడూన్‌కు తరలించారు. మంగళూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-58లో ఈ ప్రమాదం జరిగింది.

గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్ చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ అందించాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రమాద స్థలం నుండి డబ్బును కూడా తీసుకున్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. కారు రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత అందులో నుంచి బయటికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కారు రోడ్డు డివైడర్‌ని ఢీకొట్టిన తర్వాత మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో వేగంగా కారు వద్దకి వచ్చిన జనాలు, కారులో ఇరుక్కున్న రిషబ్ పంత్‌ని రక్షించడానికి బదులుగా కారులో ఉన్న విలువైన నగలు, డబ్బులు తీసుకుని పారిపోయినట్లు సమాచారం.

న్యూ ఇయర్‌కి తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఇంటికి బయలుదేరిన పంత్ కుటుంబ సభ్యుల కోసం కొన్ని కానుకలు కొనుగోలు చేశాడు. రిషబ్ పంత్‌కి ఉండే బంగారు గొలుసు, బ్రాస్‌లైట్ వంటి ఖరీదైన వస్తువులు అపహరణకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రిషబ్ పంత్ కోలుకుని, ఈ విషయంపై నోరు విప్పితే కానీ అసలు ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ రాదు. ప్రమాదం జ‌రిగిన స్థలంలో డబ్బులు కూడా కిందపడి ఉన్నాయి.

పంత్ కు తీవ్ర గాయాలు

ఈ ప్రమాదంలో పంత్ తల, మోకాలు, భుజాలపై గాయాలయ్యాయి. అతని కాలు ఫ్రాక్చర్ అయి ఉండవచ్చు. ప్రస్తుతం పంత్ డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడ అతడికి ప్లాస్టిక్ సర్జరీ చేయనున్నారు. ఆయన పరిస్థితిని తెలుసుకునేందుకు ఖాన్‌పూర్‌ ఎమ్మెల్యే ఉమేష్‌కుమార్‌ ఆస్పత్రికి చేరుకున్నారు.