Site icon HashtagU Telugu

world cup 2023: పోలీస్ ఓవరాక్షన్, సీరియస్ అయిన పాకిస్తానీ

World Cup 2023 (43)

World Cup 2023 (43)

world cup 2023: చిన్నస్వామి వేదికగా ఆస్ట్రేలియా పాకిస్థాన్ లాంటి పటిష్టమైన టీమ్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ బ్యాటర్లు భీబత్సం సృష్టించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ మిచెల్ మార్ష్ చెరో సెంచరీ బాది భారీ స్కోరుకు పునాది వేశారు. డేవిడ్ వార్నర్ 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163 భారీ స్కోర్ చేశాడు, మరో ఎండ్ లో మిచెల్ మార్ష్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరి ధాటికి ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఛేదనలో పాకిస్తాన్ కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. షఫీక్ 64 పరుగులు, ఇమామ్ 70 పరుగులతో రాణించారు. షఫీక్ ఔటైనా తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎంతోసేపు నిలబడలేదు. కేవలం 18 పరుగులతో నిరాశపరిచాడు. ఇమామ్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన రిజ్వాన్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు.40 బంతుల్లో 46 పరుగుల చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత షకీల్ 30, అహ్మద్ 26 పరుగులు చేశారు. నిజానికి గెలిచే మ్యాచ్ ని పాక్ ఆటగాళ్లు వికెట్లు కోల్పోయి చేజార్చుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది.

మ్యాచ్ చూసేందుకు వచ్చిన పాకిస్తానీ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. బెంగుళూరులో మ్యాచ్ కావడంతో ఆల్మోస్ట్ ఇండియన్స్ తో స్టేడియం నిండిపోయింది. కొందరు పాకిస్తాన్ నుంచి మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అయితే పాకిస్థాన్ ఆటగాళ్లకు మద్దతుగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన పాక్ అభిమానిని ఓ పోలీస్ అడ్డుకున్నాడు. పాకిస్థాన్ జిందాబాద్ అనడానికి వీలు లేదని చెప్పడంతో సదరు పాక్ సిటిజెన్ ఖంగుతిన్నాడు. దీంతో ఆ పోలీస్ ని నిలదీశాడు. నా దేశానికి, మా జట్టుకు మద్దతు తెలిపే అధికారం లేదా అంటూ ఇచ్చిపడేశాడు.అభిమాని సీరియస్ కావడంతో మ్యాచ్ నిర్వాహకులు అతనికి క్షమాపణలు చెప్పి ఆ పోలీస్ ను అక్కడి నుంచి పంపించేసారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇక్కడ పోలీస్ తీరును తప్పుబడుతున్నారు. ఇదేమైనా భారత్ మ్యాచ్ అనుకున్నావా అని ఒకరు, పాకిస్తాన్ అంటే అంత ద్వేషం ఎందుకు బ్రో అంటూ ప్రశ్నించారు. ఏదేమైనా పోలీస్ ఓవరాక్షన్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.

Also Read: Telangana: ప్రవళ్లిక ఆత్మహత్య కేసులో శివరాం రాథోడ్‌కు బెయిల్‌ మంజూరు

Exit mobile version