West Indies : కరేబియన్ దీవుల్లో నయా టీ10 క్రికెట్

టెస్ట్ , వన్డేలని వెనక్కి నెడుతూ ఈ శతాబ్దం ఆరంభంలో టీ ట్వంటీ ఫార్మాట్ వచ్చింది. రెండేళ్ల క్రితం టీ ట్వంటీ లకు పోటీగా యూఏఈలో టీ 10 ఫార్మాట్ మొదలయింది.

  • Written By:
  • Publish Date - June 24, 2022 / 12:44 PM IST

టెస్ట్ , వన్డేలని వెనక్కి నెడుతూ ఈ శతాబ్దం ఆరంభంలో టీ ట్వంటీ ఫార్మాట్ వచ్చింది. రెండేళ్ల క్రితం టీ ట్వంటీ లకు పోటీగా యూఏఈలో టీ 10 ఫార్మాట్ మొదలయింది. ఇప్పుడు టీ 10 ఫార్మాట్ ను మరింత రసవత్తరంగా మార్చే క్రమంలో కరేబియన్ దీవుల్లో సన్నాహాలు మొదలయ్యాయి. సిక్స్టీ క్రికెట్ పేరుతో విండీస్ క్రికెట్ బోర్డు టోర్నీ నిర్వహించనుంది. ఇక క్రికెట్ అంటే ఒక జట్టుకు మిగిలేది 60 బంతులు.. ఎంత కొట్టుకున్నా, ఎన్ని విధ్వంసాలు జరిగినా ఆ 60 బంతుల్లోనే.. ఈ ఏడాది సీపీఎల్ 10వ ఎడిషన్ కంటే ముందే ఆగస్టు లోనే దీనిని ప్రారంభించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో సీపీఎల్ లో పాల్గొంటున్న ఆరు మెన్స్ టీమ్స్, 3 ఉమెన్స్ టీమ్స్ పాల్గొంటాయి. సెయింట్ కిట్స్ వేదికగా ఆగస్టు 24 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక నయా టోర్నీకి యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీ నిభందనలు కొత్తగా ఉన్నాయి. సాధారణ క్రికెట్ లో మాదిరిగా ఇందులో ఒక ఇన్నింగ్స్ కు పది మంది బ్యాటింగ్ చేయరు. బ్యాటింగ్ కు వచ్చేది ఆరుగురు బ్యాటర్లే. బ్యాటింగ్ చేస్తున్న టీమ్ తొలి ఓవర్లో రెండు సిక్సర్లు కొడితే వాళ్లకు థర్డ్ పవర్ ప్లే అందుబాటులోకి వస్తుంది. రెండు సిక్సర్లు కొట్టలేని పక్షంలో మూడో పవర్ ప్లే ఉండదు. ప్రస్తుతం ఓవర్ ఓవర్ కు మధ్యలో ఫీల్డింగ్ ఛేంజ్, వికెట్ కీపర్ వేరే ఎండ్ వంటివి ఇందులో ఉండవు. ఒకే ఎండ్ నుంచి వరుసగా ఐదు ఓవర్లు బౌలింగ్ చేసుకోవచ్చు. 45 నిమిషాల్లో పది ఓవర్లు వేయలేకుంటే చివరి ఆరు బంతులు వేసేప్పుడు బౌలింగ్ టీమ్ నుంచి ఒక ఫీల్డర్ ను తీసేస్తారు. అంటే బౌలర్, కీపర్ పోను అవతల ఫీల్డింగ్ చేసేది 8 మంది మాత్రమే. కొత్త నిబంధనలతో సిక్స్టీ క్రికెట్ ఫాన్స్ కు మరింత వినోదాన్ని అందిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.