Site icon HashtagU Telugu

Cricket Question: కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్ కు సంబంధించిన ప్రశ్న.. సమాధానం ఏంటో తెలుసా..?

Cricket Question

Compressjpeg.online 1280x720 Image 11zon

Cricket Question: ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati)లో క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్న(Cricket Question) అడిగారు. అది ఆటగాళ్ల విద్యార్హతకు సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్న ఖరీదు రూ. 12,50,000 లక్షలు. ఈ ఆటగాళ్లలో ఎవరికి ఇంజినీరింగ్ డిగ్రీ లేదని ప్రశ్న అడిగారు. ఆప్షన్లలో అనిల్ కుంబ్లే, ఆర్. అశ్విన్, కృష్ణమాచారి శ్రీకాంత్, రాహుల్ ద్రవిడ్ పేర్లను చేర్చారు.

పైన పేర్కొన్న నలుగురు ఆటగాళ్లలో ప్రస్తుత భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఇంజనీరింగ్ డిగ్రీ లేని క్రికెటర్. ఇది కాకుండా మిగిలిన ముగ్గురు ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, ఆర్ అశ్విన్, కృష్ణమాచారి శ్రీకాంత్‌లు ఇంజనీరింగ్ డిగ్రీలు కలిగి ఉన్నారు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. అశ్విన్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చేశారు. అనిల్ కుంబ్లే మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు.

Also Read: World Cup Tickets: 400,000 టిక్కెట్‌లను విడుదల చేయనున్న బీసీసీఐ

అశ్విన్‌ను ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపిక చేయలేదు

మంగళవారం (సెప్టెంబర్ 5) రాబోయే ODI ప్రపంచ కప్ 2023 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో స్టార్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ కి జట్టులో చోటు దక్కలేదు. అంతకుముందు అశ్విన్‌ను ఆసియా కప్‌కు కూడా దూరంగా ఉంచారు. దింతో అశ్విన్ టీమ్ ఇండియాకు మెల్లగా దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. స్టార్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ భారత్ తరఫున మూడు ఫార్మాట్‌లు ఆడతాడు. ప్రస్తుతం టెస్టు బౌలర్లలో అశ్విన్ నంబర్ వన్. ఇప్పటి వరకు 94 టెస్టులు, 113 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 23.65 సగటుతో 489 వికెట్లు తీశాడు. ఇది కాకుండా వన్డేల్లో 33.49 సగటుతో 151 వికెట్లు తీశాడు. అదే సమయంలో టీ20 ఇంటర్నేషనల్‌లో 23.22 సగటుతో 72 వికెట్లు పడగొట్టాడు. జూన్ 2010లో అశ్విన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.