చారిత్రాత్మక రికార్డు.. ఒకే ఓవర్‌లో 48 పరుగులు!

ఈ చారిత్రాత్మక ఘట్టం కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో 'షాహీన్ హంటర్స్', 'అబాసిన్ డిఫెండర్స్' మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. 19వ ఓవర్ వరకు షాహీన్ హంటర్స్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు.

Published By: HashtagU Telugu Desk
Cricket History

Cricket History

Cricket History: క్రికెట్ మైదానంలో ఒకే ఓవర్‌లో ఏం జరగవచ్చు? అనే చర్చ వచ్చినప్పుడల్లా ఆఫ్ఘనిస్తాన్ యువ బ్యాటర్ సెదికుల్లా అటల్ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. కేవలం 21 ఏళ్ల వయసులో అటల్ సృష్టించిన ఈ రికార్డు రెండు ఏళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఒకే ఓవర్‌లో ఏకంగా 48 పరుగులు రాబట్టడం, అందులో 7 సిక్సర్లు బాదడం నేటికీ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంది.

ఒకే ఓవర్‌లో 48 పరుగులు

ఈ చారిత్రాత్మక ఘట్టం కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో ‘షాహీన్ హంటర్స్’, ‘అబాసిన్ డిఫెండర్స్’ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. 19వ ఓవర్ వరకు షాహీన్ హంటర్స్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. 6 వికెట్లు కోల్పోయి 158 పరుగుల వద్ద ఉన్న ఆ జట్టుపై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. క్రీజులో కెప్టెన్ సెదికుల్లా అటల్ ఉన్నప్పటికీ మ్యాచ్ ఎటువైపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి.

అప్పుడే 19వ ఓవర్ వేయడానికి ఎడమచేతి వాటం స్పిన్నర్ అమీర్ జజాయ్ వచ్చాడు. ఆ ఓవర్ మొదటి బంతే నో-బాల్‌గా పడింది. దానిని అటల్ నేరుగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ తర్వాత బౌలర్ పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు. వరుసగా వైడ్ బంతులు, ఫ్రీ హిట్లు.. వీటికి తోడు అటల్ బాదిన సిక్సర్లతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.

Also Read: ముగిసిన 14 ఏళ్ల బంధం.. విడాకులు ప్రకటించిన ప‌వ‌ర్ క‌పుల్‌!

రికార్డుల వర్షం.. 48 పరుగుల ఓవర్!

ఆ ఒక్క ఓవర్‌లో మొత్తం 48 పరుగులు వచ్చాయి. అటల్ ఏడు సిక్సర్లు బాదాడు. అదే ఓవర్‌లో కేవలం 48 బంతుల్లోనే తన సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. గుర్తింపు పొందిన ఏ టోర్నమెంట్‌లోనైనా ఒకే ఓవర్‌లో నమోదైన అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డు ఇదే. బౌలర్ అమీర్ జజాయ్‌కు ఇది ఒక పీడకలలా మిగిలిపోయింది. అతను తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 79 పరుగులు సమర్పించుకున్నాడు.

అటల్ మెరుపు బ్యాటింగ్ పుణ్యమా అని షాహీన్ హంటర్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ఒత్తిడికి లోనైన అబాసిన్ డిఫెండర్స్ 121 పరుగులకే కుప్పకూలింది. హంటర్స్ జట్టు 92 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

సెదికుల్లా అటల్

ఆఫ్ఘనిస్తాన్ ఉధయిస్తున్న నక్షత్రం ఈ మ్యాచ్‌లో అటల్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 118 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాబూల్ సమీపంలోని లోగర్ ప్రాంతానికి చెందిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 2023-24 కాలంలో ఆఫ్ఘనిస్తాన్ తరపున మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం టెస్ట్, వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్ ఆడుతున్న అటల్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

  Last Updated: 04 Jan 2026, 03:53 PM IST