ఆంధ్రప్రదేశ్ అంతా ఈరోజు క్రికెట్ వీక్షిస్తూ బిజీ అయ్యారు. మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రాష్ట్రం నలుమూలలలో ఉత్సాహం అలుముకుంది. గ్రామం నుంచి పట్టణం వరకు ప్రతి చోటా భారత మహిళా జట్టు విజయమే చర్చ. వివిధ పట్టణాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ల వద్ద అభిమానుల కేరింతలు మార్మోగుతున్నాయి. పిల్లలు, యువత, మహిళలు సమూహాలుగా చేరి మ్యాచ్‌ను ఉత్సాహంగా వీక్షిస్తున్నారు. టీమిండియా ప్రతి బౌండరీ, వికెట్‌కి కేరింతలు, డప్పుల సవ్వడులు, పూల వర్షాలు వినిపిస్తున్నాయి. సాధారణ క్రికెట్ మ్యాచ్‌లకంటే మహిళల ఫైనల్‌కి ప్రజల స్పందన అసాధారణంగా ఉండటమే రాష్ట్రంలో క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తిని తెలియజేస్తోంది.
Allu Sirish -Nayanika Love Story: అల్లు శిరీష్ – నయనికల లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా..?
ప్రతి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంచాయతీ మైదానాలు, మార్కెట్‌యార్డులు, కమ్యూనిటీ హాల్స్, విద్యాసంస్థల ఆవరణల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం వీక్షించే అవకాశం కల్పించారు. భారత్ జట్టు గెలవాలని అందరూ ఏకకంఠంతో ప్రార్థిస్తున్నారు. కొన్ని చోట్ల మహిళా సంఘాలు, యువజన మండళ్లు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ఏకతాటిపై ఉన్న ఈ ఉత్సాహం మహిళా క్రీడాకారిణులకు మానసిక బలాన్నిస్తుంది. “మా అమ్మాయిలు విజయం సాధిస్తారు” అన్న నమ్మకం ప్రతి ఒక్కరి ముఖంలో కనిపిస్తోంది.
Ap Match3
Ap Match2
Ap Match1
IND vs AUS 3rd T20I: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం!
ఇలాంటి కార్యక్రమాలు కేవలం వినోదం కోసమే కాకుండా ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, క్రీడల పట్ల ఆసక్తిని పెంచే సానుకూల దిశగా తీసుకువెళ్తున్నాయి. రాజకీయ విభేదాలు, సామాజిక వర్గాలు అన్న భేదం లేకుండా అందరూ భారత జట్టు విజయకాంక్షతో కలిసిపోవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. మహిళా క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడంలో ఈ ఫైనల్ మ్యాచ్ ఒక కొత్త మైలురాయిగా నిలుస్తోంది. “భారత్ మాతా కి జై”, “వన్ టీం, వన్ డ్రీం” అంటూ మారుమ్రోగుతున్న నినాదాలు ఏపీ అంతా క్రీడా ఉత్సాహంతో నింపుతున్నాయి.
