ఐపీఎల్ ప్రసార హక్కులు ఈ సారి రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయి. గతంతో పోలిస్తే ఒక్కో మ్యాచ్ కోసం 118 కోట్ల రూపాయలు బీసీసీఐ అందుకొనింది. తద్వారా ప్రపంచంలోనే ఇది రెండో అత్యధిక ధర కలిగిన స్పోర్ట్స్ లీగ్ గా ఐపీఎల్ రికార్డు సృష్టించింది. ముఖ్యంగా టీవీ ప్రసార హక్కుల తరహాలోనే డిజిటల్ రైట్స్ రికార్డు ధర పలికాయి. వచ్చే అయిదేళ్ల కు గానూ రిలయన్స్ వయాకామ్ 18 సంయుక్తంగా 20 వేల కోట్ల పైన బిడ్ వేసి హక్కులు దక్కించుకున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన Viacom18 నెట్‌వర్క్ ఈ భారీ ఒప్పందాన్ని దక్కించుకోవడంతో రిలయన్స్ సంస్థ డైరెక్టర్, ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ క్రికెట్ ఫాన్స్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. దేశంతో పాటు ప్రపంచంలోని ప్రతి క్రికెట్ ప్రేమికుడికి ఐపీఎల్‌ను తీసుకెళ్లాలని కంపెనీ కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ప్రపంచ స్థాయి ఐపీఎల్ కవరేజీని సృష్టించడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. భారతదేశంలో ఐపీఎల్ అత్యుత్తమంగా ప్రాతినిధ్యం వహిస్తుందని… ప్రస్తుతం డిజిటల్ విప్లవం కొనసాగుతున్న మన దేశంలో ప్రతి గడపకూ ఐపీఎల్ టోర్నమెంట్ చేరుతుందని తెలిపారు. క్రీడలు అలరిచడంతో పాటు స్ఫూర్తిని నింపుతాయన్నారు. మనందరినీ ఒక్కటి చేస్తాయనీ, . దేశంలో క్రికెట్, IPL అత్యుత్తమ ప్రాతినిధ్యం వహిస్తున్నాయనీ గుర్తు చేశారు.
అందుకే ఈ గొప్ప క్రీడ, అద్భుతమైన లీగ్‌తో తమ అనుబంధాన్ని మరింతగా పెంచుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. మనదేశం లేదా ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే.. క్రికెట్ ప్రేమికులకు సంతోషకరమైన ఐపీఎల్ అనుభవాన్ని ఇవ్వడమే లక్ష్యమనీ నీతా అంబానీ చెప్పారు. రానున్న రోజుల్లో డిజిటల్ విప్లవం అత్యుత్తమ స్థాయిలో ఉంటుందని , అందుకే భారీ ధరకు ఐపీఎల్ ప్రసార హక్కులు కొనుగోలు చేశామని తెలిపారు.