Commonwealth Games 2026: స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో 2026లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఆ క్రీడోత్సవం జాబితా నుంచి హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, స్క్వాష్, షూటింగ్, నెట్ బాల్, రోడ్ రేసింగ్‌లను తొలగించారు. ఈవిషయాన్ని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య(Commonwealth Games 2026) ప్రకటించింది. వాస్తవానికి ఈ నిర్ణయం భారత్‌కు షాక్ ఇచ్చేదే అని చెప్పొచ్చు.
Also Read :Baba Hamas : కశ్మీరులో ‘ఉగ్ర’ నెట్‌వర్క్.. తెరపైకి బాబా హమాస్.. అతడు ఎవరు ?
ఎందుకంటే మనదేశానికి కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు వచ్చే అవకాశమున్న హాట్ ఫేవరేట్ విభాగాలు హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్. ఇప్పుడు వాటినే తొలగించడంతో భారత్‌కు పతకాలు వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. 2022 సంవత్సరంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 61 పతకాలను సాధించి నాలుగో ప్లేసులో నిలిచింది. భారత్‌కు వచ్చిన మొత్తం పతకాలలో 22 గోల్డ్ మెడల్స్, 16 రజత పతకాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. మన దేశానికి రెజ్లింగ్‌లో 12 పతకాలు, వెయిట్ లిఫ్టింగ్‌లో 10 పతకాలు వచ్చాయి. 2022 సంవత్సరంలో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 19 ఈవెంట్లను నిర్వహించారు. అయితే ఈసారి నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకుగానూ కేవలం 10 ఈవెంట్‌లను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
Also Read :Air Craft Manufacturing Hub: భారత్ లో విమానాల తయారీ కేంద్రం: కేంద్రమంత్రి రామ్మోహన్
నాలుగేళ్లకోసారి కామన్వెల్త్ క్రీడలు జరుగుతుంటాయి. వాస్తవానికి 2026 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగరం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే నిర్వహణ ఖర్చులను భరించే పరిస్థితి లేకపోవడంతో తాము ఆతిథ్యం ఇవ్వలేమని ఆస్ట్రేలియా ప్రకటించింది. దీంతో టోర్నీ నిర్వహణకు స్కాట్లాండ్ దేశం ఆసక్తి చూపించింది. 2026లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో కామన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడోత్సవాలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని దక్కించుకున్న స్కాట్లాండ్ చాలామేరకు ఆర్థిక వనరులను పొదుపు చేస్తోంది. ఈక్రమంలోనే తాము 10కి మించి ఈవెంట్లను నిర్వహించలేమని కామన్వెల్త్ క్రీడల సమాఖ్యకు తెలిపింది. ఈ ప్రతిపాదనకు కామన్వెల్త్ క్రీడల సమాఖ్య నుంచి అనుమతి లభించింది. ఇందులో భాగంగానే ఆసియా దేశాలు బలంగా ఉండే హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ వంటి విభాగాలను తొలగించారు.