Site icon HashtagU Telugu

Asia Cup 2023: కొద్ది గంటల్లో భారత్,పాక్ పోరు… ఎక్కడో తెలుసా ?

Asia Cup 2023

New Web Story Copy 2023 07 18t222235.830

Asia Cup 2023: ప్రపంచ క్రికెట్ లో భారత్ , పాకిస్తాన్ తలపడుతున్నాయంటే ఉండే క్రేజే వేరు..ఏ ఫార్మాట్ లోనైనా, ఏ క్రీడలోనైనా దాయాది దేశాలు పోటీపడుతున్నాయంటే అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి ఉంటుంది. క్రికెట్ లో అయితే ఇక చెప్పక్కర్లేదు. సామాన్య అభిమాని నుండి సెలబ్రిటీ వరకూ టీవీలకు అతుక్కుపోతారు. పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో గత కొన్నేళ్ళుగా కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్ తలపడుతోంది. ఈ సారి కూడా ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ లలో చిరకాల ప్రత్యర్థుల సమరం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ లోపే భారత్ , పాక్ క్రికెట్ సమరం వీక్షించే అవకాశం దక్కింది. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీలో ఇరు జట్లూ తలపడబోతున్నాయి. ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ లో భారత్ , పాక్ . శ్రీలంక, నేపాల్ , యూఏఈ, ఆఫ్ఘనిస్థాన్ , బంగ్లాదేశ్, ఒమన్ జట్లు ఆడుతున్నాయి. భారత్ ఎ జట్టు ఇప్పటికే రెండు వరుస విజయాలతో సెమీస్ చేరుకోగా.. చివరి లీగ్ మ్యాచ్ లో పాక్ ఎ జట్టుతో ఆడనుంది.

ఐపీఎల్ లో సత్తా చాటిన పలువురు యువక్రికెటర్లు భారత్ ఎ జట్టులో ఉన్నారు. యశ్ ధల్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా.. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ , ధృవ్ జురెల్, ప్రభ్ సిమ్రన్ సింగ్ , సాయిసుదర్శన్ , తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి జట్టులో ఉన్నారు. భారత్ ఎ జట్టు ఇప్పటికే యూఏఈ, నేపాల్ జట్లపై భారీ విజయాలు సాధించి గ్రూప్ బి నుండి సెమీస్ లో అడుగుపెట్టింది. బుధవారం పాక్ ఎ జట్టుపై గెలిస్తే గ్రూబ్ బి నుండి టాప్ ప్లేస్ తో సెమీస్ కు రెడీ అవుతుంది. యువక్రికెటర్లందరూ సమిష్టిగా రాణిస్తుండడంతో ఈ టోర్నీలో భారత్ జట్టే టైటిల్ ఫేవరెట్ గా ఉంది. అటు పాక్ ఎ జట్టు కూడా ఇవే జట్లపై గెలిచినప్పటకీ.. రన్ రేట్ విషయంలో భారత్ మెరుగ్గా ఉంది. ఇరు జట్లలోనూ యువక్రికెటర్లు ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయమని చెప్పొచ్చు. గత రికార్డులు, ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే యువభారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే టోర్నీ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ భారత్, పాక్ మ్యాచ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: CM Jagan: సీఎం జగన్ అందరి ఎకౌంట్లు సెటిల్ చేస్తడు