Site icon HashtagU Telugu

FIFA WC: జపాన్ కు కోస్టారికా షాక్

Costarica

Costarica

సాకర్ ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదయింది. ప్రపంచ 24వ ర్యాంకర్‌ జపాన్‌ కు 31 ర్యాంకర్‌ కోస్టారికా షాక్ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కోస్టారికా..1-0 తేడాతో గెలిచి వరల్డ్‌కప్‌ లో బోణీ విజయం సాధించింది. 81వ నిమిషంలో కీషర్‌ ఫుల్లర్‌ గోల్‌ కొట్టి కోస్టారికాను ఆధిక్యంలోకి తీసుకుకెళ్లాడు. అనంతరం జపాన్‌ ఎంత ప్రయత్నించినప్పటికీ.. గోల్‌ చేయలేక ఓటమిపాలైంది. ఈ గెలుపుతో కోస్టారికా గ్రూప్‌-ఈలో మూడో స్థానానికి ఎగబాకింది. కాగా మెగా టోర్నీలో నవంబర్‌ 23న జరిగిన మ్యాచ్‌లో జపాన్‌.. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ జర్మనీపై 2-1 తేడాతో గెలుపొంది సంచలనం సృష్టించింది. అదే రోజు స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోస్టారికా 0-7 గోల్స్‌ తేడాతో ఓటమిపాలై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

గత మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయిన కోస్టారికా.. ఈ పోరులో మెరుగైన ప్రదర్శన చేసింది. మొదటి నుంచి దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థి గోల్‌పోస్టుపై ఎదురు దాడులు చేసింది. జపాన్‌ కూడా ప్రతిఘటించడంతో తొలి అర్ధభాగంలో గోల్సేమీ నమోదు కాలేదు. విరామం తర్వాత కూడా చాలా సమయం వరకూ ఏ జట్టూ ఖాతా తెరవలేకపోయింది. దీంతో టోర్నీలో మరో గోల్‌ లేని డ్రా తప్పదనిపించింది. అయితే ప్రత్యర్థి డిఫెన్స్‌ తప్పిదాన్ని సొమ్ము చేసుకున్న ఫుల్లర్‌ 18 మీటర్ల దూరం నుంచి బంతిని నెట్‌లోకి పంపించాడు. దీంతో కోస్టారికా తొలి విజయాన్ని అందుకుంది.

Exit mobile version