India CWG Medals: జుడోలో రెండు పతకాలు, వెయిట్ లిఫ్టింగ్ లో మరో కాంస్యం

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం తృటిలో చేజారింది. గోల్డ్‌ మెడల్‌పై ఆశలు రేపిన జూడోకా సుశీల దేవి.. 48 కేజీల కేటగిరీలో సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకుంది

  • Written By:
  • Publish Date - August 2, 2022 / 10:42 AM IST

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం తృటిలో చేజారింది. గోల్డ్‌ మెడల్‌పై ఆశలు రేపిన జూడోకా సుశీల దేవి.. 48 కేజీల కేటగిరీలో సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆమె సౌతాఫ్రికా జూడోకా మిచేలా వైట్‌బూయి చేతుల్లో ఓడిపోయింది. చివరి వరకూ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా.. స్వర్ణం మాత్రం గెలవలేకపోయింది. అయితే అంతకుముందు సెమీఫైనల్లో ఆమె టాప్‌ సీడ్‌కు షాకిచ్చింది. సుశీల దేవి వుమెన్స్‌ 48 కేజీల కేటగిరీలో టాప్‌ సీడ్‌ ప్రిసిల్లా మొరాండ్‌ను ఓడించింది.
గాయం కారణంగా కుడి కాలికి నాలుగు కుట్లతో బరిలోకి దిగిన సుశీల 4.25 నిమిషాల పాటు హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచింది.
ఇంతకుముందు 2014లోనూ ఆమె కామన్వెల్త్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ గెలిచింది. ఈసారి గోల్డ్‌ తెస్తుందని అనుకున్నా.. ఫైనల్లో ఆమెకు ఓటమి తప్పలేదు. కామన్వెల్త్‌ గేమ్స్ జూడోలో ఇప్పటి వరకూ భారత్ స్వర్ణం గెలవలేదు. గతేడాది జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున క్వాలిఫై అయిన ఏకైక జూడోకాగా సుశీల నిలిచినా.. తొలి రౌండ్‌లోనే ఆమె ఓడిపోయింది. మరోవైపు పురుషుల 60 కేజీల విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. వారణాసికి చెందిన విజయ్‌ కుమార్‌ యాదవ్‌ కాంస్య పతక పోరులో 58 సెకన్లలోనే పెట్రోస్‌ క్రిస్టోడూలిడ్స్‌ (ఎల్ను ఓడించాడు. అయితే జూడోలోనే భారత్‌కు రెండు పతకాలు చేజారాయి. అటు వెయిట్ లిఫ్టింగ్ లో
భారత్ జోరు కొనసాగుతోంది. తాాజాగా మరో వెయిట్​ లిఫ్టర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. 71 కేజీల విభాగంలో పోటీపడిన హర్జీందర్ కౌర్ ఫైనల్లో కాంస్యం గెలిచింది. వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కి ఇది ఏడో మెడల్ ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్‌ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి తొమ్మిది పతకాలతో ఆరో స్థానంలో ఉంది.