PV Sindhu Wins Gold: శభాష్ సింధు.. కామన్వెల్త్ లో పీవీ సింధు సంచలనం!

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత ప్లేయర్స్ అదరగొడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Pv Sindhu

Pv Sindhu

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత ప్లేయర్స్ అదరగొడుతున్నారు. ఇప్పటికే నిఖత్ జరీన్ బాక్సింగ్ లో బంగారు పతాకాన్ని కైవసం చేసుకోగా, తాజాగా  బాడ్మింటన్ మహిళల సింగిల్స్  లో పీవీ సింధు సోమవారం ఆధిపత్య ప్రదర్శన చేసి తొలి స్వర్ణం సాధించింది. సింధు 21-15, 21-13 స్కోర్‌లైన్‌తో మాజీ ఛాంపియన్ ను మిచెల్ లీని ఓడించింది. ఇది సింధుకు కామన్వెల్స్ లో తొలి బంగారు పతాకం. సింధు తన ఎడమ చీలమండపై గాయంతోనే మ్యాచ్‌ను ప్రారంభించింది. అయితే లీ పోరాడి 4-4తో సమం చేసింది. గేమ్ చాలా వరకు హోరాహోరీగా జరగడంతో పాయింట్స్ సమానంగా వచ్చాయి. కానీ సింధు తన అద్భత మైన ఆటతీరుతో  11-8 ఆధిక్యంతో మరో రౌండ్ లోకి దూసుకెళ్లింది.

భారత ఏస్ మూడు వరుస పాయింట్లు సాధించి లీపై ఒత్తిడి తెచ్చింది. సింధు మొదటి గేమ్‌లో లీ కంటే చాలా బాగా ఆడింది. 21-15 స్కోర్‌ తో నిలిచింది. రెండో  గేమ్‌లో సింధు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 9-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత ఏస్ 11-6 స్కోర్‌తో రెండవ గేమ్‌లో హాఫ్‌వే పాయింట్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య హోరాహోరీగా గేమ్ సాగింది. అయితే మ్యాచ్‌లో లీ చేసిన అనేక అనవసర తప్పిదాలు చేయడం కూడా సింధుకూ కలిసివచ్చింది. మొత్తంగా సింధు 20-13 పాయింట్లతో ఆధిక్యం సాధించి బంగారు పతాకం కైవసం చేసి చరిత్ర తిరగరాసింది.

  Last Updated: 08 Aug 2022, 05:29 PM IST