Site icon HashtagU Telugu

IND vs ENG 1st Test: భారత్-ఇంగ్లాండ్ టెస్టుకు సీఎం రేవంత్ హాజరు

IND vs ENG 1st Test

IND vs ENG 1st Test

IND vs ENG 1st Test: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. దావోస్ వెళ్లిన రేవంత్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణకు వేలకోట్ల పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 40 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అనంతరం హైదరాబాద్ వేదికగా జరగనున్న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ జరిగే తొలి టెస్టుకు హాజరవుతారు. ఈ విషయాన్నీ హైదరాబాద్ క్రికెట్ బోర్డు HCA తెలిపింది.

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మరో కీలక సమరానికి సిద్ధమవుతోంది. భారత్ , ఇంగ్లండ్ మధ్య జరగనున్న తొలి టెస్టుకు హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. జనవరి 25 నుంచి తొలి టెస్ట్‌ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం హెచ్‌సీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం దిగ్గజ ఆటగాళ్లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరవుతారు. ఉప్పల్ టెస్ట్‌కు చీఫ్ గెస్ట్‌గా రేవంత్ రెడ్డి , సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజ‌రుకానున్నారు. దీంతో మ్యాచ్ ని చూసేందుకు ఫాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. పేటీఎం ఇన్‌సైడర్ ద్వారా ఆన్‌లైన్ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్లను ఆన్ లైన్ లో పెట్టిన 12 గంటల్లోనే 10 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. 200, 499 ప్రైజ్ తో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ లో టికెట్లు దొరక్కపోతే ఆఫ్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంచారు.

తొలి టెస్టు మ్యాచ్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ధోనీ హారవుతుండటంతో టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ మ్యాచ్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వడంతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నారు, మరుసటి రోజు రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులకు కూడా ఉచిత ప్రవేశ సౌకర్యం కల్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లండన్‌ నుంచి రాగానే నేరుగా కలిసి ఈ మ్యాచ్ కు చీప్ గెస్ట్ గా హాజ‌రుకావాల‌ని ఆహ్వానం అందిస్తామ‌ని హెచ్సీఎ తెలిపింది. అయితే టెస్టుకు రెండు రోజుల ముందు జనవరి 23న హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో బీసీసీఐ అవార్డ్స్ ప్ర‌ధానోత్స‌వ కార్యక్రమం జరుగుతుంది.

Also Read: Malvi Malhotra : ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయిన మాల్వీ మల్హోత్రా

Exit mobile version