China Badminton Player : బ్యాడ్మింటన్‌ ఆడుతూ గుండెపోటుతో చైనా ఆటగాడు మృతి..

చైనా ఆటగాడు జాంగ్ అస్వస్థత కారణంగా కాసేపు నిలబడ్డాడు. రెండు అడుగులు ముందుకేశాడు. వెంటనే కుప్పకూలిపోయాడు

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 03:22 PM IST

ఇటీవల కాలంలో గుండెపోటు (Heart Attack) మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ముందు వరకు కూడా గుండెపోటు మరణాలు తక్కువగా నమోదు అవుతూ ఉండేవి..అవి కూడా 60 , 70 ఏళ్ల పైబడిన వారు గుండెపోటుకు గురయ్యి మరణించేవారు..కానీ ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. ఐదేళ్ల చిన్నారుల దగ్గరి నుండి 90 ఏళ్ల ముసలాడి వరకు ఇలా అందరికి గుండెపోటు అనేవి వస్తున్నాయి. అప్పటివరకు సంతోషంతో మన మద్యే ఉన్న వారు సడెన్ గా కుప్పకూలి..అక్కడిక్కడే మృతి చెందుతున్నారు. ప్రతి రోజు ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ టోర్నీలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో చైనా ఆటగాడు (Chinese Badminton Player dies) అక్కడిక్కడే మృతి చెందాడు. ఇండోనేషియా వేదికగా ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ (Asia Junior Championships) జరుగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో మ్యాచ్ జరుగుతోంది. చైనా-జపాన్ క్రీడాకారులు నువ్వేనేనా అన్నరీతిలో తలపడ్డారు. 17 ఏళ్ల చైనా ఆటగాడు జాంగ్ జిజీ (Zhang Zhi Jie )- జపాన్ ప్లేయర్ కజుమాతో ఆడుతున్నారు. మొదటి ఆటలో ఇద్దరి స్కోర్ 11-11 వద్దకు చేరింది. ఈ క్రమంలో చైనా ఆటగాడు జాంగ్ అస్వస్థత కారణంగా కాసేపు నిలబడ్డాడు. రెండు అడుగులు ముందుకేశాడు. వెంటనే కుప్పకూలిపోయాడు. ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించి, అంబులెన్స్‌లో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జాంగ్ చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో టోర్నీ ఆర్గనైజర్స్ షాకయ్యారు. తోటి ఆటగాళ్లు విషాదంలో ముగినిపోయారు. ఈ ఘటనపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ వార్తతో నా హృదయం ముక్క లైందని తెలిపింది. ఈ సమయంలో జాంగ్ ఫ్యామిలీకి సానుభూతి వ్యక్తం చేసింది. ఈ ఘటన కు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో షేర్ అవుతుంది.